Supreme Court: మీకు సంసారం చేసే టైం ఉందా.. టెక్కీలకు సుప్రీంకోర్టు వింత ప్రశ్న..

బతుకులు మెకానికల్ అయిపోయాయ్ అనిపిస్తుంది సాఫ్ట్‌వేర్ జంటల జీవితాలు చూస్తుంటే ! భార్యభర్తలది.. ఇద్దరిదీ ఒక్కో షిఫ్ట్‌. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం కూడా కుదరదు చాలామందికి ! అందుకే బంధానికి బ్రేకులు పడుతున్నాయ్. విడాకుల వరకు వస్తున్నాయ్. చాలామంది ఉద్యోగాల జీవితాల్లో జరుగుతోంది ఇదే. ఇలాంటి కేసే సుప్రీంకోట్లు మెట్లెక్కింది. సర్వోన్నత న్యాయస్థానం వేసిన ఓ ప్రశ్న ఇప్పుడు.. దేశం అంతా ఆశ్చర్యపోయేలా చేసింది.

  • Written By:
  • Publish Date - April 24, 2023 / 06:30 PM IST

దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. వీరిలో ఒకరు ఉదయం ఉద్యోగానికి వెళ్తే.. ఇంకొకరు రాత్రి విధులకు వెళ్తుంటారు. మనస్ఫర్ధలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. ఐతే వైవాహిక బంధాన్ని నిలుపుకోడానికి మరో అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ఆ జంటను సుప్రీం న్యాయమూర్తులు ప్రశ్నించారు. భార్యాభర్తలుగా కలిసి ఉండటానికి సమయం కేటాయించలేకపోతున్న మీరు పెళ్లి బంధాన్ని ఎందుకు నిలబెట్టుకోడానికి ప్రయత్నం చేయలేదని నిలదీసింది.

కర్ణాటకకు చెందిన ఓ జంట విడాకుల కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తలుగా కలిసి ఉండటానికి సమయం కేటాయించలేకపోతున్న మీరు.. మీ వివాహ బంధాన్ని నిలబెట్టుకునేందుకు మరో చాన్స్‌ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని సాఫ్ట్‌వేర్ జంటను ప్రశ్నించింది. ఒకరు పగలు ఉద్యోగానికి వెళ్తే.. మరొకరు రాత్రి వెళ్తున్నారు.. మీకు దాంపత్యానికి సమయమేది.. విడాకులు తీసుకోవడంపై బాధ అవసరం లేదు. ఐనా పెళ్లి బంధాన్ని నిలుపుకోవడానికి రెండో అవకాశం ఎందుకు తీసుకోరు అంటూ ఇద్దరికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు.

ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నామని చెప్పారు. దీంతో విడాకులు మంజూరు చేసింది. ఈ కేసు, విచారణలో కోర్టు ప్రశ్నలు.. ఉద్యోగాలు చేస్తున్న చాలామంది భార్యభర్తల జీవితాలకు అద్దంపడుతోందనే చర్చ సోషల్‌ మీడియాలో సాగుతోంది.