Paragliding: ప్రాణం తీసిన పారాగ్లైడింగ్.. కులూలో తెలంగాణ మహిళ మృతి

ఈ జంట విహారయాత్ర కోసం హిమాచల్‌ప్రదేశ్‌‌లోని కులూ వెళ్లింది. విహారయాత్రలో భాగంగా అక్కడ నవ్య పారాగ్లైడింగ్ చేసింది. అయితే, ప్రమాదవశాత్తు పారాగ్లైడింగ్ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. నవ్య పారాగ్లైడింగ్ చేస్తుండగా, భర్త అక్కడే కింద ఉన్నారు.

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 04:36 PM IST

Paragliding: విహారయాత్ర విషాదంగా మారింది. సరదా కోసం చేసిన పారాగ్లైడింగ్ తెలంగాణ మహిళ ప్రాణం తీసింది. కులూలో ఒక మహిళ పారాగ్లైడింగ్ చేస్తూ, ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయింది. కట్టుకున్న భర్త ఎదుటే భార్య నేలకూలి మరణించింది. ఈ ఘటన తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో జరిగింది. జహీరాబాద్‌కు చెందిన సాయి మోహన్‌, నవ్య(26) దంపతులు చండీగఢ్‌లో ఉంటున్నారు.

Jaya Prada: జయప్రదను అరెస్ట్ చేయండి.. పోలీసులకు కోర్టు ఆదేశం

ఈ జంట విహారయాత్ర కోసం హిమాచల్‌ప్రదేశ్‌‌లోని కులూ వెళ్లింది. విహారయాత్రలో భాగంగా అక్కడ నవ్య పారాగ్లైడింగ్ చేసింది. అయితే, ప్రమాదవశాత్తు పారాగ్లైడింగ్ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. నవ్య పారాగ్లైడింగ్ చేస్తుండగా, భర్త అక్కడే కింద ఉన్నారు. భర్త కళ్లముందే నవ్య ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు, పారాగ్లైడింగ్ చేస్తున్నప్పుడే కుటుంబ సభ్యులతో నవ్య వీడియో కాల్ కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనకు పారాగ్లైడింగ్ సేఫ్టే బెల్ట్ సరిగ్గా పెట్టుకోకపోవడమే కారణం. ఈ విషయలో నిర్లక్ష్యం వహించాడు పారాగ్లైడింగ్ పైలట్. అతడు సేప్టీ సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టకపోవడం వల్లే నవ్య ప్రమాదంలో కింద పడి ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు ఆమెను తీసుకెళ్లిన పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. పైలట్ నిర్లక్ష్యంతోనే నవ్య ప్రాణాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పారాగ్లైడింగ్‌కు అన్ని సేప్టీ మెజర్‌మెంట్స్ ఉన్నాయని, పైలట్ కూడా పారాగ్లైడింగ్ లైసెన్స్ కలిగినవాడేనని తేల్చారు. మానవ తప్పిదమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించిన పోలీసులు.. బాధిత మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పైలట్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కులులోని దోభీ గ్రామంలో పారాగ్లైడింగ్ కార్యకలాపాలన్నీ నిలిపివేశారు.