కోల్‌కతా డాక్టర్ హత్యాచారం ఘటన.. ప్రతీ భారతీయుడి మనసు మెలేస్తోంది. ఆ ఆసుపత్రిలో.. ఆ చీకట్లో.. చీకటిలోని ఆ ఆసుపత్రిలో.. ఆ యువతి ఎన్ని ఆర్తనాదాలు చేసి ఉంటది.. ఎంత నరకం చూసి ఉంటదన్న ఆలోచనే.. తెలియకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది ప్రతీ ఒక్కరితో. ఈ దారుణంపై దేశమంతా రియాక్ట్ అవుతోంది. పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయ్. డాక్టర్లందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. డాక్టర్ సామూహిక అత్యాచారానికి గురైందంటూ.. బయటకు వచ్చిన మెడికల్ రిపోర్ట్స్.. మరణాన్ని మించిన బాధను కగిలిస్తున్నాయ్.
ఐతే చనిపోయిన డాక్టర్.. ఈ దారుణానికి కొద్ది నిమిషాల ముందు తన డైరీలో రాసుకున్న పదాలు.. ఇప్పుడు ప్రతీ ఒక్కరి మనసులను మెలేస్తున్నాయ్. ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లే ముందు.. ఎప్పటిలాగే ఆ యువ డాక్టర్ తన డైరీ రాసుకుంది. తన జీవిత లక్ష్యాలను మరోసారి గుర్తు చేసుకుంది. గోల్డ్ మెడల్ సాధించాలని.. దానికోసం ఎంత కష్టపడానికైనా సిద్ధం అంటూ.. ఆ పేజీలో రాసుకొచ్చింది ఆ డాక్టర్. ప్రస్తుతం ఎండీ చదువుతున్న ఆ యువతి.. పరీక్షల్లో టాపర్‌గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించాలన్నది లక్ష్యమని ఆ డైరీలో రాసుకుంది.
వైద్య వృత్తి పట్ల తనకున్న అంకితభావం ఆమె డైరీలో కనిపిస్తుంది. ఆ డైరీ గుండెలకు హత్తుకుంటూ.. ఆ డాక్టర్ తల్లిదండ్రులు పెడుతున్న కన్నీరు.. యావత్ భారతదేశాన్ని కదిలిస్తోంది. తన కూతురికి చదువంటే చాలా ఇష్టమని.. అన్నిట్లో టాప్ ర్యాంక్ రావాలని కోరుకునేదని.. తను జీవితంలో బాగా సెటిల్ కావడం కోసం కుటుంబం అంతా ఎన్నో త్యాగాలు చేసిందని.. ఆ అమ్మానాన్నలు చెప్తున్న మాటలకు కన్నీళ్లు ఆగడం లేదు. గోల్డ్ మెడల్ సాధించాలన్న తన కల సాకారం చేసుకోవడం కోసం.. రోజూ 10 నుంచి 12 గంటలు చదువుకునేదని.. ఆ తండ్రి చెప్తున్న మాటలు.. ప్రతీ గుండెను కదిలిస్తున్నాయ్.