శిరీషను అనిల్కొడుతుంటే తండ్రిగా ఏం చేశావంటూ మహిళలు ప్రశ్నించారు. శిరీష ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అటు శిరీష, అనిల్ మధ్య కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కూడా ఉందని తేలింది. శనివారం రాత్రి ఫోన్ ఎక్కువగా వాడుతున్నావ్ అంటూ ఆమె అన్నయ్య తిట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటికొచ్చిన బావ అనిల్ కూడా.. శిరీషను కొట్టాడు. దీంతో ఆమె మనస్థాపం చెందింది. అప్పుడు అర్థరాత్రి కలుద్దామని చెప్పి, శిరీషను అనిల్ బయటకు పిలిచాడు. అందరూ పడుకున్న తర్వాత.. శిరీష తలుపుని బయట నుంచి గడియపెట్టి వచ్చేసింది.
ఇద్దరు కలుసుకున్న తర్వాత.. వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది. యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అటు శిరీష కేసులో అనుమానితుడిగా అమె బావ అనిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. అనిల్ ఫోన్‌లో డార్లింగ్ పేరుతో శిరీష పేరు ఉండడం.. మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. శిరీష మృతదేహానికి వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు, వైద్యులు.. అత్యాచారం జరిగిందా.. లేదా. అనే దాన్ని పరీక్షల్లో నిర్ధారించనున్నారు.
పరీక్షల కోసం పరిగి నుంచి డాక్టర్ వైష్ణవి వచ్చారు. నీటికుంటలో పడినపుడు శిరీష కళ్లకు రాళ్లు గుచ్చుకుని గాయాలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా ఆమెపై దాడి చేశారా.. అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. ఇక అటు అనిల్ భార్య శ్రీలత.. పరిగి పీఎస్ ముందు ఆందోళనకు దిగింది. శిరీష మర్డర్ కేసుతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని.. వదిలిపెట్టాలని వేడుకుంటోంది.
తన భర్తతో పాటు తనను కూడా అరెస్ట్ చేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో కేసు మరో మలుపు తీసుకున్నట్లు అయింది. శ్రీలత.. శిరీషకు స్వయాన అక్క. అలాంటిది అనిల్‌ను వెనకేసుకురావడం.. అటు గ్రామస్థులు అంతా తండ్రి మీద అనుమానాలు వ్యక్తం చేయడం.. కేసును కీలక మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయ్.