కలకత్తా డాక్టర్‌ కేస్‌ నిందితుడి సంజయ్‌ రాయ్‌ బ్యాగ్రౌండ్‌ ఇదే

కలకత్తా ఆర్జీకార్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం, హత్య ఘటన ఇప్పుడు దేశం మొత్తాన్ని రోడ్డెక్కేలా చేసింది. డాక్టర్‌ చనిపోయింది అని ఆమె పేరెంట్స్‌కు సమాచారం ఇవ్వడం దగ్గర మొదలుపెడితే ఇప్పటి వరకూ జరుగుతున్న చాలా పరిణామాలు ఈ కేసును తప్పుదారి పట్టించేందుకే జరుగుతున్నాయి అనే అనుమానాలు కలిగిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 19, 2024 / 01:10 PM IST

కలకత్తా ఆర్జీకార్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం, హత్య ఘటన ఇప్పుడు దేశం మొత్తాన్ని రోడ్డెక్కేలా చేసింది. డాక్టర్‌ చనిపోయింది అని ఆమె పేరెంట్స్‌కు సమాచారం ఇవ్వడం దగ్గర మొదలుపెడితే ఇప్పటి వరకూ జరుగుతున్న చాలా పరిణామాలు ఈ కేసును తప్పుదారి పట్టించేందుకే జరుగుతున్నాయి అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. ఎవరో పెద్ద వ్యక్తులు ఈ వ్యవహారం వెనక ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఇంతటి క్రైం చేసినా సంజయ్‌ రాయ్‌ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు అంటే.. అసలు ఎవరీ సంజయ్‌ రాయ్‌.. ఏంటి ఇతని బ్యాగ్రౌండ్‌ అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

అత్యంత దారుణంగా డాక్టర్‌ను రేప్‌ చేసి చంపేసిన సంజయ్‌ రాయ్‌.. కలకత్తా పోలీస్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ మెంబర్‌. ఆర్జీకార్‌ హాస్పిటల్‌ అవుట్‌పోస్ట్‌లో ఎక్కుడ డ్యూటీలు చేసిన కారణంగా హాస్పిటల్‌లోని ప్రతీ డిపార్ట్‌మెంట్‌తో రాయ్‌కి కనెక్షన్స్‌ బాగా పెరిగిపోయాయి. 2019లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌కు వాలంటీర్‌గా జాయిన్‌ అవ్వడంతో సంజయ్‌ జీవితం మొదలయ్యింది. అక్కడి నుంచి తనకున్న పరిచయాలన ద్వారా వెల్ఫేర్‌ బోర్డ్‌కు బదిలీ అయ్యాడు. అక్కడి నుంచి వివిద పోస్టుల్లో వివిధ ప్రాంతాలకు ట్రాన్సఫర్‌ అవుతూ ప్రస్తుతం సివిక్‌ వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. వెళ్లిన ప్రతీ చోటా ఇల్లీగల్‌ పనులు చేయడం. అడ్డదారిలో డబ్బు సంసాదించడం. ఆడవాళ్లను వేధించడం. ఇదే సంజయ్‌ రాయ్‌ వ్యవహారం. ఇదంతా ఎవరికీ తెలియదా అంటే.. అందరికీ తెలుసు.

కానీ ఎవరూ ఏం మాట్లాడరు. ఎందుకంటే డిపార్ట్‌మెంట్‌లో రాయ్‌కి ఉన్న కాంటాక్ట్స్‌ అలాంటివి. లంచం తీసుకుని దాదాపు ఆరు మంది ఆఫీసర్లకు రాయ్‌ పోస్టింగ్‌ వచ్చేశా చేశాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎక్కువకాలం ఆర్జీకార్‌ హాస్పిటల్‌లో డ్యూటీ చేసిన కారణంగా ఆ హాస్పిటల్‌లోని ప్రతీ డిపార్ట్‌మెంట్‌తో రాయ్‌కి సంబంధాలు ఉన్నాయి. వాటి ద్వారానే అర్థరాత్రి సమయంలో కూడా రాయ్‌ హాస్పిటల్‌లో ఎంటర్‌ కాగలిగాడు. ఆర్జీకార్‌ కాస్పిటల్‌లో సీనియర్‌ సర్జన్స్‌తో కూడా కాని పనులు సంజయ్‌ చిటికెలో చేసేవాడు. సీట్లు ఇప్పించడం మొదలు పెడితే పేషెంట్లకు బెడ్లు ఇప్పించడం వరకూ సంజయ్‌కి పాజిబుల్‌ కాని విషయం లేదు. ప్రతీ డిపార్ట్‌మెంట్‌లో డబ్బుకు అమ్ముడుపోయేవాళ్లు కొందరు ఉంటారు. వాళ్లే సంజయ్‌కి కీలు బొమ్మలు.

డబ్బు తీసుకుని పనులు చేస్తారు కాబట్టి వీడి వేసే వెధవ వేశాలు కూడా ఎవరికీ చెప్పరు. అదే హాస్పిటల్‌లో చాలా మందిని రాయ్‌ వేధించాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు ఉన్నా కూడా రాయ్‌ని అక్కడే డ్యూటీలో కంటిన్యూ చేశారు పోలీసులు. ఈ డ్యూటీకిగాను డిపార్ట్‌మెంట్‌ నుంచి జీతంతో పాటు ఫ్రీగా పోలీస్‌ బైక్‌, రోజుకి 5 లీటర్ల పెట్రోల్‌ ఇచ్చేవాళ్లు. ఊరంతా బలాదూర్‌ తిరగడం, తాగడం, ఆడవాళ్లను వేధించడం.. సివిక్‌ వాలంటీర్‌గా కలకత్తా పోలీసులకు సహాయంగా సంజయ్‌ రాయ్‌ చేస్తున్న డ్యూటీ ఇది. వీడొక్కడు చాలు కలకత్తా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఎంత దరిద్రంగా పని చేస్తుందో చెప్పడానికి. వాడికి వాళ్లు ఇచ్చిన అలుసే ఓ నిండు ప్రాణం పోయేలా చేసింది. ఎంతో మందికి ప్రాణాలు పోయాల్సిన ఆ డాక్టర్‌ను అదే హాస్పిటల్‌లో శవంగా మారేలా చేసింది.