Titan submersible: క్షణాల్లోనే శరీరాలు కాలి బూడిదయ్యాయి.. టైటాన్‌ ప్రమాదం వివరాలు వెల్లడించిన అమెరికన్‌ నేవీ..

ఒకవేళ జలాంతర్గామి పగిలిపోతే ఆ గాలి స్వయంచాలకంగా మారి జలాంతర్గామిని కాల్చేస్తుంది. అంటే ఈ స్థాయిలో విస్పోటనం జరిగితే సెకను కాలంలోనే అందులో ఉన్నవాళ్ల శరీరాలు కాలి బూడిదైపోతాయి. వీళ్ల విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు అధికారులు.

  • Written By:
  • Publish Date - June 24, 2023 / 06:06 PM IST

Titan submersible: అట్లాంటిక్‌ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ షిప్‌ చూసేందుకు వెళ్లిన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ జలాంతర్గామి నీటిలో పేలిపోయింది. ఈ జలాంతర్గామిలో ప్రయాణించిన ఐదుగురు బిలియనీర్లు చనిపోయారు. వాళ్లలో ఈ జలాంతర్గామిని తయారు చేసిన కంపెనీ కో ఫౌండర్‌ స్టాంక్టన్‌ రష్‌ కూడా ఉన్నారు. ఉత్తర అట్లాంటిక్‌లోని న్యూ ఫౌండ్‌ ఐల్యాండ్‌ నుంచి ఈ జలాంతర్గామి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

సముద్రం లోపలికి 3 వేల 8 వందల మీటర్లు ప్రయాణించిన తరువాత జలాంతర్గామి నుంచి పైన ఉన్న మదర్‌ షిప్‌‌కి సిగ్నల్‌ కట్‌ అయ్యింది. అప్పటి నుంచి అమెరికా, కెనడా నేవీ దళాలు జలాంతర్గామిని వెతికేందుకు రిమోట్‌ కంట్రోల్డ్‌ వెహికిల్స్‌తో గాలింపు ప్రారంభించాయి. కానీ నిన్న జలాంతర్గామి పేలిపోయినట్టు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన తీరును అమెరికన్‌ నేవీ అధికారులు వివరించారు. సముద్రం పైభాగంతో పోలీస్తే నీటిలోపల పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది. టైటాన్‌ జలాంతర్గామి వెళ్లిన దూరాన్ని బట్టి దానిపై 10 వేల టన్నుల ఒత్తిడి ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. సాధారణంగా ఇంత స్థాయి పీడనాన్ని తట్టుకునే విధంగానే జలాంతర్గామిని తయారు చేశారు.

కానీ ప్రమాదం జరిగింది. జనరల్‌గా నీటిలోపల ఉన్న వస్తువుకు పగుళ్లు ఉంటే దానిమీద వాటర్‌ ప్రెజర్‌ ఎక్కువగా ఉంటుంది. టైటాన్‌ జలాంతర్గామి విషయంలో కూడా అదే జరిగి ఉండవచ్చంటున్నారు అధికారులు. ఇదే నిజమైతే. గంటకు 2,414 కిలో మీటర్ల వేగంతో పీడనం పెరుగుతుంది. అంటే సెకనులో వెయ్యో వంతులోనే జలాంతర్గామి తునాతునకలైపోతుంది. దానికి తోడు జలాంతర్గామిలో ఉండే గాలి హైడ్రో కార్బన్‌ ఆవిరితో ఉంటుంది. ఒకవేళ జలాంతర్గామి పగిలిపోతే ఆ గాలి స్వయంచాలకంగా మారి జలాంతర్గామిని కాల్చేస్తుంది. అంటే ఈ స్థాయిలో విస్పోటనం జరిగితే సెకను కాలంలోనే అందులో ఉన్నవాళ్ల శరీరాలు కాలి బూడిదైపోతాయి. వీళ్ల విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు అధికారులు.

టైటాన్‌ జలాంతర్గామి మిస్‌ అయిన తరువాత గాలింపు చేపట్టిన రిమోట్‌ కంట్రోల్డ్‌ వెహికిల్స్‌ కొన్ని శబ్దాలను గుర్తించాయి. అవి టైటాన్‌ పేలిపోయిన్నప్పుడు వచ్చిన శబ్ధాలే అయి ఉండొచ్చని చెప్తున్నారు. టైటాన్‌ జలాంతర్గామిని తయారు చేసిన ఓషియన్‌ గేట్‌ సంస్థలో ఉన్న అత్యంత లోతుకు వెళ్లే జలాంతర్గామి టైటాన్‌ మాత్రమే. అంత లోతులో పీడనాన్ని తట్టుకునేంత బలంగా తయారు చేసినా ఈ జలాంతర్గామి ప్రమాదానికి గురవడం చాలా బాధాకరం.