Titan Submersible: అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ చూసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు బిలియనీర్ల విషాదగాథలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన ఓషియన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాంక్టన్ రష్ పూర్వీకులు టైటానిక్ ప్రమాదంలోనే చనిపోయారట. టైటానిక్ మునిగిన తరువాత చాలా మందిని లైఫ్ బోట్‌ల ద్వారా కాపాడారు.
చాలా మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బార్యాబిడ్డలను, తోబుట్టువులను వదిలి లైఫ్‌బోట్‌లో వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ స్ట్రాస్ అనే మహిళ మాత్రం బోట్‌లో వెళ్లిపోయేందుకు వీలు ఉన్నా తన భర్తను విడిచి వెళ్లలేదు. తన భర్తతో పాటే ఆ ప్రమాదంలో ప్రాణాలు వదిలేసింది. తమ పిల్లలను మాత్రం సురక్షిత ప్రాంతానికి పంపించింది. స్ట్రాస్ దంపతుల కూరుతు మిన్నీకి మనువరాలే స్టాంక్టన్ రష్ భార్య. తన పూర్వీకులు చనిపోయిన ప్రాంతాన్ని చూపించేందుకు స్టాంక్టన్ రష్ చాలా సార్లు తన భార్యను జలాంతర్గామిలో టైటానిక్ మునిగిన ప్రాంతానికి తీసుకువెళ్లాడట. కానీ రీసెంట్‌గా జరిగిన ప్రమాదంలో అనుకోకుండా స్టాంక్టన్ ప్రాణాలు కోల్పోయాడు.
ఇక పాకిస్థాన్‌కు చెందిన మరో బిలియనీర్ షెహ్‌జాదా దావూద్‌తో పాటు వచ్చిన ఆయన కొడుకు సులేమాన్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడు. నిజానికి సులేమాన్‌కు ఇలాంటి సాహసయాత్రలంటే చాలా భయమట. కానీ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రితో పాటు టైటానిక్ చూసేందుకు వెళ్తానని చెప్పాడట సులేమాన్. తండ్రితో వెళ్లి అదే ప్రమాదంలో తండ్రితో పాటే ప్రాణాలు కోల్పోయాడు. వేల కోట్లు సంపాదించిన ఈ బిలియనీర్లు కుటుంబానికి కడచూపు కూడా లేకుండా ఇలా జలసమాధి కావడం వాళ్ల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.