సినీ ఇండస్ట్రీలో అనేక మందితో గొప్పవారితో పరిచయాలున్నాయని అవకాశాల పేరుతో అమ్మాయిలకు ఎరవేసిన నరేష్. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అనంతరం ఆ యువతులను వ్యభిచారంలోకి దింపి ప్రముఖుల వద్దకు ఆ యువతులను పంపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
సినిమా అంటే రంగురంగుల ప్రపంచం. దేశవిదేశాల ప్రయాణం, సమాజంలో ప్రాముఖ్యం లభిస్తుందని ఎక్కడెక్కడి నుంచో ఆశల రెక్కలు కట్టుకొని వాలిపోతారు. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వమని స్టూడియోల చుట్టూ తిరిగే వాళ్లు ఉంటారు. ఏదో ఒక సినిమాల్లో నటించి ఓ రేంజ్ లో రాణించాలని.. సెలబ్రెటీ హోదాతో జీవించాలని, బాగా డబ్బులు సంపాదించాలని ఇలా రకరకాల కారణాలతో యువతులు సినీ ఇండస్ట్రీవైపు ఆకర్షితులవుతున్నారు. అవకాశాలు రాక కొందరు.. వచ్చిన అవకాశాలు అంతంతమాత్రంగా ఉండడంతో కొందరు మానసిక వేదనకు గురి అవుతూ ఉంటారు. అయితే సినిమా అవకాశాల పేరుతో యువతలు మోసపోతున్న వారి సంఖ్యకు కొదవ లేదు. తాజాగా ఒక తెలుగు టాప్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు అవకాశాల పేరుతో భారీ సంఖ్యలో యువతులను మోసం చేసిన చీకటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో ఓ ఆన్లైన్ వ్యభిచారం ముఠా గుట్టు రట్టు కావడంతో ఈవిషయం బయటకు వచ్చింది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ తో పాటూ మరో వ్యక్తి అఖిల్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
2017 నుంచి సురేష్ బోయిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. దీంతో తనకు సినీ పరిశ్రమలో అనేక పరిచయాలున్నాయని.. అవకాశం ఇప్పిస్తామని అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అనంతరం ఆ యువతులను వ్యభిచారంలోకి దింపి ప్రముఖుల వద్దకు ఆ యువతులను పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతనిపై నిఘా పెట్టిన పోలీసులు అమ్మాయిల ఫోటోలను ఆన్లైన్లో పెట్టి వ్యభిచారం చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇప్పటివరకూ 500 మంది అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తూ గోవా, బెంగళూరు వంటి నగరాలకు సైతం యువతులను విటుల వద్దకు పంపిస్తున్నట్లు గుర్తించారు. సినిమా అవకాశాల పేరుతో తెలుగు అమ్మాయిలను మాత్రమే కాదు.. ముంబై, ఢిల్లీ, బెంగాల్ సహా అనేక ప్రాంతాల యువతులను కూడా రంగంలోకి దింపి.. వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
హోటల్స్, ఓయో రూమ్స్ కేంద్రంగా వ్యభిచారం సాగుతుందని అంటున్నారు. లోకంటో, స్కొక్క, బ్యాక్ పేజి వెబ్ సైట్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు పెడుతూ విటులను ఆకర్షిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఇద్దరు నిందితులపై గతంలో కూడా బ్రోతల్ కేసులో బుక్ అయినట్లు చెప్పారు. ప్రతి అమ్మాయి డీల్ వెనుక 40% కమిషన్ తీసుకుంటున్నట్టు, అసిస్టెంట్ డైరెక్టర్ బోయిన సురేష్ హై ఫై అమ్మాయిలను బిగ్ షాట్స్ వద్దకు పంపిస్తున్నాడని అఖిల్ రెడ్డి పేర్కొన్నారు.