KP Choudhary: సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్‌ కలకలం.. కేపీ దగ్గర డ్రగ్స్‌ కొన్న సెలబ్రిటీలు వాళ్లేనా..?

ఖమ్మం జిల్లా బోనకల్‌కు చెందిన కేపీ చౌదరి.. 2016లో సినీ ఇండస్ట్రీలోకి డిస్ట్రిబ్యూటర్‌గా అడుగుపెట్టాడు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, అర్జున్‌ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలకు కేసీ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు. రజినీకాంత్‌ హీరోగా వచ్చిన కబాలి సినిమాను ప్రొడ్యూస్ కూడా చేశాడు.

  • Written By:
  • Publish Date - June 15, 2023 / 03:02 PM IST

KP Choudhary: సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్‌ ప్రకంపణలు చెలరేగాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌, కబాలి సినిమా ప్రొడ్యూసర్‌ కేపీ చౌదరిని డ్రగ్స్‌ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని దగ్గర చాలా మంది సినీ ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగానే ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్‌కు చెందిన కేపీ చౌదరి.. 2016లో సినీ ఇండస్ట్రీలోకి డిస్ట్రిబ్యూటర్‌గా అడుగుపెట్టాడు.

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, అర్జున్‌ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలకు కేసీ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు. రజినీకాంత్‌ హీరోగా వచ్చిన కబాలి సినిమాను ప్రొడ్యూస్ కూడా చేశాడు. సినిమాల్లో నష్టం రావడంతో గోవాకు మకాం మార్చాడు. OHM పేరుతో క్లబ్‌ ప్రారంభించి క్లబ్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్‌ నుంచి గోవాకు వచ్చే సెలబ్రిటీలకు గోవాలో అకామిడేషన్‌ ఏర్పాటు చేసేవాడు. కానీ కొన్ని రోజులకు క్లబ్‌ వ్యాపారం కూడా కేపీకి కలిసిరాలేదు. దీంతో నష్టాలు, అప్పుల నుంచి బయట పడేందుకు డ్రగ్స్‌ దందా మొదలు పెట్టాడు. నైజీరియా నుంచి డ్రగ్స్‌ సప్లై చేసే గాబ్రియెల్‌తో చేతులు కలిపి అతని దగ్గర 111 గ్రాముల కొకైన్‌ తీసుకున్నాడు. కొకైన్‌ తీసుకుని నేరుగా హైదరాబాద్‌ చేరుకున్నాడు.

కానీ ఇప్పటికే ఈ విషయాన్ని పసిగట్టిన ఎస్‌ఓటీ.. పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో రెడ్‌ హ్యాండెడ్‌గా కేపీ చౌదరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. కేపీ నుంచి 90 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన కొకైన్‌ తానే తీసుకున్నట్టు పోలీసులకు చెప్పాడు కేపీ. కానీ పోలీసులు మాత్రం చాలా మంది సెట్రబిటీలు కేపీ నుంచి కొకైన్‌ కొనుగోలు చేసినట్టు అనుమానిస్తున్నారు. కేపీ చౌదరికి కొకైన్‌ అమ్మిన గాబ్రియెల్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఫుడ్‌ డెలివరీ బాయ్‌ని రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పుడు కూడా గాబ్రియెల్‌ పేరు బయటికి వచ్చింది. ఆ డెలివరీ బాయ్‌కు గాబ్రియెల్‌ డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు పోలీసులు చెప్పారు. ఇప్పుడు కూడా కేపీ చౌదరి వ్యవహారంలో మరోసారి గాబ్రియెల్‌ పేరు బయటికి రావడంతో అతనికి చెక్‌ పెట్టాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.

గాబ్రియెల్‌ కోసం రెండు స్పెషల్‌ టీంలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. కేపీ తాను తీసుకున్నానని చెప్పిన కొకైన్‌ నిజంగా తానే తీసుకున్నాడా లేక ఎవరికైనా అమ్మేశాడా అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్‌ విషయంలో కేపీ చౌదరికి సినీ స్టార్స్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కేపీ దగ్గర దొరికిన కొకైన్‌ ఎవరికి అమ్మేందుకు హైదరాబాద్‌ తీసుకువచ్చాడనే యాంగిల్‌లో కేపీని విచారిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీస్‌తో కేపీ చౌదరి పార్టీల్లో దిగిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఇన్వెస్టిగేషన్‌ పూర్తైన తరువాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.