TRISHA ARREST: హైదరాబాద్‌లో ఒక యువకుడిని ఇష్టపడ్డ యువతి, అతడిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా కిడ్నాప్ చేసింది. సదరు యువకుడు ఒక టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నాడు. అయితే, బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితురాలి దారుణం వెలుగుచూసింది. కానీ, ఈ ఘటనలో అనేక ట్విస్టులున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణవ్ అనే యువకుడు ఒక టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నాడు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధం!
అతడి ఫొటోను త్రిష అనే యువతి ఒక మ్యాట్రిమోనీ యాప్‌లో చూసి ఇష్టపడింది. ఆమె డిజిటల్ మార్కెటింగ్‌లో పనిచేస్తోంది. అలాగే ఐదు స్టార్టప్ కంపెనీలకు ఎండీగా కూడా ఉంది. ఈ క్రమంలో మ్యాట్రిమొని యాప్‌లో ప్రణవ్ ఫొటో చూసి, అతడితో కాంటాక్ట్‌లోకి వెళ్లింది. కానీ, ఆ ఐడీ అతడిది కాదు. ప్రణవ్‌కు అలా సైట్‌లో తన పేరుతో ఒక ప్రొఫైల్ ఉందనే తెలీదు. చైతన్య రెడ్డి అనే యువకుడు ప్రణవ్ ఫొటోతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశాడు. ఆ ఐడీ ప్రణవ్‌ది కాదని గుర్తించి, తర్వాత ఎలాగోలా ప్రణవ్‌తో కాంటాక్ట్‌లోకి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న త్రిష.. ప్రణవ్‌కు ఈ ఫేక్ ఐడీ విషయం గురించి చెప్పింది. తర్వాత ప్రణవ్‌తో మరింత పరిచయం పెంచుకుంది. అంతే కాదు.. ప్రణవ్ కారులో ట్రాకర్ అమర్చి, అతడి కదలికలపై నిఘా పెట్టింది.
ఈ క్రమంలో కొంతకాలం నుంచి తనను పెళ్లి చేసుకోవాలని ప్రణవ్‌పై త్రిష ఒత్తిడి చేసింది. దీనికి అతడు అంగీకరించకపోవడంతో ఏకంగా అతడిని కిడ్నాప్ చేయించింది. ఫిబ్రవరి 10న ఐదుగురు వ్యక్తులు ప్రణవ్‌ను కిడ్నాప్ చేసి, ఒక గదిలో బంధించారు. త్రిషను పెళ్లి చేసుకోవాలని బెదిరించారు. అతడికి నరకం చూపించారు. ఈ క్రమంలోనే అతడు ఫిబ్రవరి 11న తప్పించుకున్నాడు. తర్వాత ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు త్రిషని అరెస్టు చేశారు.