TSPSC Leaks: 5 పరీక్ష పేపర్లు కొట్టేసిన ప్రవీణ్‌.. TSPSCకి రేణుకకు సంబంధం ఏంటి ?

రేణుకకు హిందీ పండిట్ ఉద్యోగం వచ్చిన తర్వాత రికార్డుల్లో ఆమె పేరులో తప్పు వచ్చింది. ఆ తప్పు సరిచేసుకునేందుకు... హైదరాబాద్‌లోని టీఎస్‍పీఎస్సీ ఆఫీస్‌కు వచ్చింది రేణుక. టీఎస్‍పీఎస్సీ కార్యదర్శి పీఏగా ఉన్న ప్రవీణ్‌తో రేణుకకు అలా పరిచయం ఏర్పడింది.

  • Written By:
  • Publish Date - March 17, 2023 / 02:20 PM IST

టీఎస్పీఎస్పీ లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్సతోంది. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ లీలలు.. అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు ప్రశ్నపత్రాలు లీకులు.. మరో వైపు సెల్‌ఫోన్‌లో యువతుల న్యూడ్‌ వీడియోలు, ఫొటోలు. విచారణ జరుపుతున్నా కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. పేపర్‌ లీకేజీ వ్యవహాం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఒక పేపర్‌ కాదు.. ఏకంగా 5పరీక్షా పేపర్లను కంప్యూటర్‌ నుంచి ప్రవీణ్‌ కొట్టేసినట్లుగా సిట్‌ విచారణలో తేలింది. ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపగా.. ఈ విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో జరగబోయే పరీక్ష పేపర్లు అన్నీ ఇస్తానని.. నిందితురాలు రేణుకకు ప్రవీణ్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏఈ పరీక్షతో పాటు మిగిలిన నాలుగు పరీక్షలను రాయబోయే అభ్యర్థులను వెతికిపట్టాలని రేణుకకు ప్రవీణ్‌ చెప్పినట్లు విచారణలో తేలింది. ఐతే ఈ ఐదు పేపర్లే కొట్టేశాడా… అంతకుమించి నంబర్ ఉంటుందా అనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పేపర్‌ లీకేజీ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రేణుక పేరు ప్రముఖంగా పదేపదే వినిపిస్తోంది. టీఎస్పీఎస్పీకి, రేణుకు సంబంధం ఏంటనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. ఐతే ప్రవీణ్‌కు రేణుక పరిచయం ఎలా ఏర్పడిందనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 2018లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గురుకుల టీచర్ పరీక్ష రాసింది రేణుక. ఆమె పరీక్ష పాస్ అయి ఉద్యోగం పొందింది. రేణుకకు హిందీ పండిట్ ఉద్యోగం వచ్చిన తర్వాత రికార్డుల్లో ఆమె పేరులో తప్పు వచ్చింది. ఆ తప్పు సరిచేసుకునేందుకు… హైదరాబాద్‌లోని టీఎస్‍పీఎస్సీ ఆఫీస్‌కు వచ్చింది రేణుక. టీఎస్‍పీఎస్సీ కార్యదర్శి పీఏగా ఉన్న ప్రవీణ్‌తో రేణుకకు అలా పరిచయం ఏర్పడింది. ఫోన్‌ నంబర్లు మార్చుకోవడాలు.. తరుచుకూగా కలుసుకోవడాలు జరిగేవి. ఐతే రేణుక, ఆమె భర్త కలిసి ఏఈ పేపర్ లీక్ చేయాలని ప్లాన్ చేశారు. ప్రవీణ్‌తో ఉన్న సన్నిహిత సంబంధంతో ముగ్గురు కలిసి పేపర్ లీక్ చేశారు. ఏఈతోనే కాకుండా.. మరో ఐదు పరీక్షలకు సంబంధించి లీకేజీ ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయారు. కోట్ల మంది నిరుద్యోగుల ఉసురుపోసుకుంటున్నారు.