Ukrainian: రష్యా బాంబుల వర్షం ధాటికి స్మశానంలా మారిపోయిన ఉక్రెయిన్

గతంలో ప్రపంచ యుద్దాలు జరిగాయని వినే ఉంటాం. అయితే వాటి దృశ్యాలు చాలా వరకూ ఎవరూ చూసి ఉండరు. కానీ ఉక్రెయిన్ పై రష్యా భీకరమైన దాడులు జరిపిన వి‎షయం మనకు తెలిసిందే. ఈ దృష్యాలను తాజాగా ఉక్రెయిన్ విదేశాంగ వ్యవహారాల శాఖ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేసింది.

  • Written By:
  • Publish Date - March 8, 2023 / 07:51 PM IST

ఈ చిత్రాలు చూస్తే ఎవరైనా హృదయ విదారక ఘటన అని చెబుతారు. ఒకప్పుడు నిరంతరం ప్రజలతో కిటకిటలాడే మరింక నగరం నేడు మట్టిపాలైపోయింది. ప్రత్యర్థిదేశం విసిరిన బాంబులకు కాలిబూడిదైపోయింది. అలాగే డొనెట్స్క్ అనే పట్టణంలోని ఒక ప్రాంతంలో ఈ యుద్దప్రభావాన్ని చూపిస్తూ ఇక చిత్రాన్ని డ్రోన్ సహాయంతో చిత్రీకరించిది ఉక్రెయిన్. యుద్దం ఎంతటి మారణ హోమాన్ని సృష్టించిందో చూడండి. ఒకప్పుడు ఇదే నగరంలో 10-15వేల మందికి పైగా నివాసం ఉండే వారు. యుద్దం దెబ్బకు ఎడారికంటే దీన పరిస్థితి కనిపిస్తుంది.

రష్యా విసిరిన అణుబాంబుల దెబ్బకు ఇళ్లన్ని నేలమట్టం అయిపోయాయి. ఇది నగరమా లేక ఊరి చివర ఉండే స్మశానమా అనేలా మారిపోయింది. ఎక్కడ చూసినా బూడిద కుప్పలు కనిపిస్తున్నాయి. ఇళ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే డాన్ బాస్ వేర్పాటు వాదులు ఉక్రెయిన్ పై దాడిచేసి అక్కడి పరిస్థితులన్నింటినీ తమ చేతుల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఉక్రెయిన్ మాత్రం దాదాపు నాలుగు నెలలపాటూ వేచి చూసి తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న చిత్రాలలో అయితే ఏఒక్కరూ నివాసయోగ్యానికి పనికొచ్చే విధంగా ఎక్కడా కనిపించడంలేదు. తిరిగి ఉక్రెయిన్ కోలుకోవాలంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు పడుతుందో లేక దశాబ్ధాలే పడుతుందో అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొంది.

అందుకే యూఎన్ఓ ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటూ.. మాటలతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తూ ఉంటాయి. పరిస్థితి చేదాటిపోయాక జాలి చూపించి ఎలాంటి ప్రయోజనం లేదు. పూర్తి స్థాయిలో ప్రళయం సంభవిస్తే పునరావాస కేంద్రం కూడా ఏమీ చేయలేదు అంటే ఇదేనేమో బహుశా. ఏది ఏమైనా రష్యా చేసింది మాత్రం తప్పుగా చెప్పాలి. తన బలాన్ని చిన్న దేశమైన ఉక్రెయిన్ పై ప్రదర్శించడం పిచుకపై బ్రహ్మాస్త్రం అనే మాటను ఈసందర్బంగా గుర్తు చేసుకోకతప్పదు.

 

T.V.SRIKAR