తమిళనాడులోని రామనాథపురం ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ అనే యువకుడు.. వీల్‌చైర్ క్రికెట్ టీమ్‌కు తాను కెప్టెన్‌నని.. పాకిస్తాన్‌తో ఆడి గెలిచానని అందరినీ మోసం చేశాడు. లండన్‌లో జరిగిన ప్రపంచకప్‌లో.. ఇండియా తరఫున తాను ప్రాతినిధ్యం వహించానని.. కల్లబొల్లి కబుర్లన్నీ చెప్పాడు. వినోద్ కుమార్ మాటలు నమ్మి.. స్థానిక జనాలు, మంత్రులు.. అతనికి భారీస్ధాయిలో ఆర్ధిక సహాయం అందించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా.. వినోద్‌కుమార్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయ్. ఐతే మోసం ఎక్కువ రోజులు కప్పి ఉంచలేరు కదా.. వినోద్ కుమార్ విషయంలో అదే జరిగింది.
కొందరు క్రీడాకారుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా.. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటకు వచ్చాయ్. అందరికీ అబద్దాలు చెప్పి.. వినోద్‌కుమార్ అందరినీ మోసం మోసం చేశారని విచారణలో తేలింది. కలకత్తాలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆడి.. అక్కడే ఓ కప్పు కొని.. లండన్ మ్యాచ్, పాకిస్తాన్ ఫైట్ అని బిల్డప్ ఇచ్చి.. గెలిచామని చెప్పి కలరింగ్ ఇచ్చాడు. చుట్టూ పక్కన ఉన్నవాళ్లనే కాదు.. ఏకంగా సీఎంను కూడా మోసం చేశాడు. ఇది ఇప్పుడు తమిళనాడులో హాట్‌టాపిక్ అవుతోంది. ఎన్నో మోసాలు చూశాం.. ఇలాంటి మోసం ఎప్పుడూ చూడలేదని తమిళనాడువాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. దివ్యాంగుడు కదా అని జాలి పడి, నిజంగా విజయం అనుకొని ఇన్‌స్పైర్ అయి తోచిన సాయం చేస్తే.. ఇంత మోసమా అంటూ చర్చ మొదలైంది. ఇలాంటి ఘటనలతోనే నమ్మకం మీద నమ్మకం పోతోందని.. మరికొందరు పోస్టులు పెడుతున్నారు.