Vizag Car Accident: ఇలా కూడా ఎఫ్‌ఐఆర్‌ చేస్తారా.. విశాఖ కార్‌ యాక్సిడెంట్‌ కేసులో.. పోలీసులు అంత తిన్నారా ?

ఇక్కడ స్పేస్‌ లేదు.. ఆయన క్రియేట్‌ చేసుకున్నాడని త్రివిక్రమ్‌ది ఓ స్పీచ్ ఉంటుంది. విశాఖలోనూ అలానే చేసిందో లేడీ.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 05:39 PM IST

మద్యం మత్తులో ఓ వీఐపీ రోడ్డులో వీరంగం క్రియేట్ చేసింది. బైక్‌లను ఢీకొట్టి అక్కడి నుంచి పరారయింది. యాక్సిడెంట్‌ చేసిన మహిళ డాక్టర్‌ కావడం.. వాళ్లకి పెద్దపెద్ద పరిచయాలు ఉండడంతో.. కేసు రకరకాల మలుపులు తీసుకుంటోంది. పోలీసుల తీరు ఏంటో బయటపడుతోంది ఈ ఘటనలో ! ఈ ప్రమాదానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదు చేయడమే కాదు.. ఆ ఎఫ్‌ఐఆర్‌లో డ్రైవ్ చేసిన వ్యక్తి పేరు ఎక్కడా కనిపించలేదు. ప్రమాదం గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తుల పేర్లు ఉన్నాయ్ కానీ.. నిందితుల పేర్లు మాత్రం మిస్సింగ్. ఏదో రాశాం అంటే రాశాం అన్నట్లుగా ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారే తప్ప.. ఈ ఘటన మీద పోలీసులు సీరియస్‌గా ఉన్నట్లు కనిపించలేదు. మసిపూరి మారేడుకాయ అన్నట్లు.. చప్పట్లు కొట్టి అంతా అయిపోయింది అన్నట్లు.. పోలీసుల తంతు కనిపించది. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాలు.. పోలీసుల తీరుకు అద్దం పడుతున్నాయ్.

నిజానికి ఈ కేసు విషయంలో విశాఖ నగర కమిషనర్‌ త్రివిక్రమ వర్మ స్పెషల్‌గా దృష్టిసారించారు. ఐతే ఆయన ఆదేశాలను కూడా లెక్కచేయకుండా.. సగంసగం సమాచారంతో పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. పేరు ఉన్న కుటుంబం.. పైగా డ్రైవ్ చేసిన లేడీ డాక్టర్‌ రిచ్‌.. పోలీసులకు అమ్యామ్యాలు బాగానే ముట్టి ఉంటాయని.. అందుకే ఇలాంటి కథలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. వీఐపీ రోడ్డు ప్రమాద ఘటనలో పోలీసులు బాగానే తిన్నట్లు అర్థం అవుతుందని మరికొందరు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అటు ఈ కేసులో తవ్వేకొద్దీ కీలక విషయాలు బయటకు వస్తున్నాయ్. సోమా పబ్‌లో రూమ్‌ నంబర్‌ 102లో ఫుల్‌గా తాగిన నలుగురు.. మద్యం మత్తులో కారు తీసుకొని బయటకు వచ్చారు. అదే మత్తులో వీఐపీ రోడ్డులో వీరంగం సృష్టించారు. యాక్సిడెంట్ చేయడమే కాదు.. రోడ్డు మీద నానా హంగామా సృష్టించారు.

నిందితుల కోసం వెతుకుతున్నామని పైకి బిల్డప్ ఇస్తున్న పోలీసులు.. ఎఫ్ఐఆర్ విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అసలే విశాఖలో ఈ మందు కల్చర్ పెరిగిపోయింది. వీకెండ్ వస్తే చాలు.. మందుబాబులు, భామలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తప్పతాగి అర్ధరాత్రుళ్లు నడి రోడ్ల మీద బీభత్సం సృష్టిస్తున్నారు. అలాంటి వారికి భయం పుట్టాలంటే.. కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి… ఇలా చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ పోలీసులు ఇస్తున్న సందేశం ఏంటి.. ఇంక ఖాకీలు మారరా.. వాళ్ల కక్కుర్తి తీరదా అని ఫైర్ అవుతున్నారు విశాఖ జనాలు.