Guddu Muslim: 15 ఏప్రిల్ 2023. ప్రయాగ్‌రాజ్‌లో ఇద్దరు మాఫియా టర్న్‌డ్ పొలిటీషియన్స్ అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లను 23 ఏళ్లు కూడా లేని ముగ్గురు వ్యక్తులు పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. లారెన్స్ బిష్ణోయ్‌లా ఫేమస్ అయ్యేందుకు అతీక్‌ను చంపేశామని చెప్పారు. వినడానికి సిల్లీగా ఉన్నా.. విచారణలో పోలీసులకు వాళ్లు చెప్పింది ఇదే. ఇండియా వైడ్‌గా గ్యాంగ్‌స్టర్ అతీక్ మర్డర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
యోగి గవర్నమెంట్‌ను ఇంటర్నేషనల్ మీడియా వేలెత్తి చూపింది. ఈ మర్డర్ తరువాత ఇప్పుడు మెయిన్‌గా వినిపిస్తున్న పేరు గుడ్డు ముస్లిం. ఎందుకంటే హంతకులు ఎటాక్ చేయకముందు గుడ్డు ముస్లిం గురించి అష్రఫ్ ఏదో చెప్పబోయాడు. “మెయిన్ బాత్ ఏ హై కీ.. గుడ్డు ముస్లిం” అనేలోగానే హంతకులు అతీక్‌ను, అష్రఫ్‌ను ఎటాక్ చేశారు. కళ్లు మూసి తెరిచేలోపు ఇద్దరి ప్రాణాల్నీ గాల్లో కలిపేశారు. దీంతో ఇప్పుడు ఫోకస్ అంతా గుడ్డు ముస్లిం మీదకు టర్న్ అయ్యింది. అష్రఫ్ చెప్పిన ఆ గుడ్డు ముస్లిం ఎవరు? జర్నలిస్ట్‌లు కేసు గురించి అడిగితే అష్రఫ్ మాత్రం గుడ్డు ముస్లిం టాపిక్ ఎందుకు తీశాడు? ఇప్పడు ఇంటర్నెట్‌లో ఇదే డిస్కషన్. అష్రఫ్ చెప్పిన గుడ్డు ముస్లిం వాళ్లకు శత్రువు కాదు. అతీక్ రైట్ హ్యాండ్. యూపీలోని చాలా మంది గ్యాంగ్‌స్టర్స్‌తో గుడ్డు ముస్లింకు సంబంధాలున్నాయి. బాంబ్స్ తయారు చేయడంలో గుడ్డు ముస్లిం ఎక్స్‌పర్ట్. షార్ప్ షూటర్ కూడా.
ఉమేష్ పాల్‌ను మర్డర్ చేసిన గ్యాంగ్‌లో గుడ్డు కూడా ఉన్నాడు. ఉమేష్ కారులో ఫస్ట్ స్మోక్ బాంబ్ విసిరింది గుడ్డునే. గుడ్డు ముస్లిం ఎంత డేంజర్ అంటే.. ఆన్ ది స్పాట్ కూడా బాంబ్ తయారు చేయగల్గుతాడు. బాంబులు తయారు చేయడానికి యూజ్ చేసే పౌడర్ ఎప్పుడూ జేబులోనే పెట్టుకుని తిరుగుతుంటాడని యూపీలో అంతా చెప్తుంటారు. అతీక్ చేసిన చాలా ఎటాక్స్‌లో గుడ్డు ముస్లిం ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఏ గ్యాంగ్‌స్టర్‌కు బాంబ్స్ కావాలన్నా అవి గుడ్డు దగ్గర్నించే వెళ్తాయి. ఉమేష్‌పాల్ మర్డర్ తరువాత గుడ్డు అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయాడు. అతనిపై 5 లక్షల రివార్డ్ కూడా ఉంది. ఇప్పుడు పోలీసులు, సిట్ ఆఫీసర్స్ గుడ్డు ముస్లిం కోసం వెతుకుతున్నారు. అష్రఫ్‌ని చంపడం జస్ట్ 5 మినట్స్ లేట్ అయినా గుడ్డు ముస్లిం గురించి ఏదో ఒక లీక్ బయటికి వచ్చేది.
తన విషయాలు బయటికి రాకుండా గుడ్డూనే అతీక్, అష్రఫ్‌ను చంపించాడా అనే యాంగిల్‌లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు. వారం రోజుల ముందు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా అష్రఫ్ తాము చనిపోతామని క్లియర్‌గా చెప్పాడు. మరో రెండు వారాళ్లో ఏదో ఒక రీజన్‌తో బయటికి తీసుకువెళ్లి మిమ్మల్ని చంపేస్తామంటూ ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ తనతో అన్నాడని అష్రఫ్ చెప్పాడు. కానీ ఆ ఆఫీసర్ పేరు చెప్పకుండా విషయం మాత్రం మీడియా ముందు చెప్పాడు అష్రఫ్. అందుకే తాను ఓ లెటర్ రాసి పెట్టినట్టు చెప్పాడు. ఆ ఆఫీసర్ చెప్పినట్టు వాళ్లు చనిపోతే ఆ లెటర్ సుప్రీం కోర్డు చీఫ్ జస్టిస్, అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్, యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్‌కు చేరుతుందని చెప్పాడు. అష్రఫ్ చెప్పినట్టుగానే అంతా జరిగింది. కానీ ఆ లెటర్ మాత్రం ఇంకా ఎవరికీ రీచ్ కాలేదు. ఆ లెటర్‌లో ఏముంది అనేది మాత్రం ఇంకా రివీల్ కాలేదు. ప్రస్తుతానికి గుడ్డు ముస్లింను కనిపెట్టే పనిలో ఉన్నారు యూపీ పోలీసులు.