ఈ విషయం తెలిసిన వెంటనే మాథ్యూ విషం తాగాడు. ఆసుపత్రిలో వారం రోజులకు పైగా చికిత్స తీసుకొని.. ఇప్పుడు చనిపోయాడు. వారం కింద.. నిందితుడి భార్యను.. ఆమె ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తన అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అప్పట్లో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యలను మార్చుకుని శృంగారం చేయడానికి తన భర్త అలవాటు పడ్డాడని.. తనను కూడా బలవంతం చేస్తున్నాడని.. అతడి స్నేహితులతో గడపాలని ఒత్తిడి చేస్తున్నాడని.. ఈ ఏడాది జనవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది మ్యాథ్యూ భార్య.
దీంతో ఆ మహిళ భర్తతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటున్న ఆ మహిళ.. కొట్టాయంలోని పుట్టింటికి వచ్చింది. మే 19న ఆమె తండ్రి, సోదరుడు పనికి వెళ్లగా.. పిల్లలు ఆడుకోవడానికి వెళ్లారు. కాసేపటి తర్వాత పిల్లలు ఇంటికి వచ్చి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి కనిపించింది. తన కుమార్తెను.. ఆమె భర్త మ్యాథ్యూనే చంపి ఉంటాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మ్యాథ్యూ కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. భార్యలమార్పిడి కేసులో.. ఇప్పటికే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాచ్. సోషల్ మీడియా ద్వారా నిర్వహిస్తున్న పార్టనర్ స్వాపింగ్ రాకెట్‌లో.. దాదాపు వెయ్యి మందికి పైగా జంటలు భాగం అయ్యారని తేలింది. ఇప్పుడీ కేసులో ప్రధాన నిందితుడు చనిపోవడంతో కేసు మరో కీలక మలుపు తిరిగినట్లు అయింది.