దేవర ఇచ్చిన ధైర్యంతో… 1000 కోట్ల పండగ..

దేవర విడుదలై 12 రోజులౌతోంది.. ఇంకో రెండో రోజులైతే రెండు వారాల బొమ్మ.... మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ అయ్యింది... 11 రోజుల్లో 730 కోట్ల గ్రాస్ వసూల్లు 466 కోట్ల నెట్ వసూళ్లొచ్చాయి... 12వ రోజు వసూళ్లతో ఏం తేలింది..?

  • Written By:
  • Publish Date - October 10, 2024 / 03:55 PM IST

దేవర విడుదలై 12 రోజులౌతోంది.. ఇంకో రెండో రోజులైతే రెండు వారాల బొమ్మ…. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ అయ్యింది… 11 రోజుల్లో 730 కోట్ల గ్రాస్ వసూల్లు 466 కోట్ల నెట్ వసూళ్లొచ్చాయి… 12వ రోజు వసూళ్లతో ఏం తేలింది..? 1000 కోట్ల పండగ రోజు ఏం జరగబోతోంది? మండే వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఇది నిజంగా నిజం… కాని ఇదే నెంబర్ ని బేస్ చేసుకుని ఏదో జరిగిపోయిందని,కంగారు పడే పరిస్థితి లేదు. ఎందుకంటే మండే తగ్గిన వసూళ్లు, మంగళవారానికి పుంజుకున్నాయి. అది కూడా ఊహించనీ రేంజ్ లో 10 కోట్ల డిఫరెన్స్ తో…. సోమవారం 52 కోట్ల వసూళ్లొస్తే, మంగళవారం 62.5 కోట్ల వసూళ్లొచ్చాయి… దీంతో 12 రోజుల వసూళ్లు 730 నుంచి 792 కోట్లకు అంటే 800 కోట్లకు దగ్గరైంది.. అయినా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి సంత్రుప్తి కలగలేదా? దేవర 2 వేల కోట్ల సినిమాగా మారుతుందని అంచనా వేశాడా? అందుకే ఛాన్స్ ఉన్నా, ఎందుకు ఎన్టీఆర్ కొంత వరకు డిసప్పాయింట్ అయ్యాడంటున్నారు..?

దేవర సునామీకి ఇక గేట్లు పడ్డట్టే అని వ్యతిరేక ప్రచారం చేసే బ్యాచ్ కి మంగళవారం వసూళ్లు మైండ్ బ్లాంక్ చేసినట్టున్నాయి. సోమవారం 52 కోట్ల వసూళ్లే వస్తే, మంగళవారం 62 కోట్ల 50 లక్షల వరకు వరల్డ్ వైడ్ గా వసూల్లొచ్చాయి. దీంతో దేవర గ్రాస్ కలెక్సన్స్ 792 కోట్లని రీచ్ అయినట్టు తెలుస్తోంది. అయినా ఇంతవరకు 500 కోట్ల క్లబ్ల లో అడుగుపెట్టినట్టుకాని, 600 కోట్లని, 700 కోట్లని, దేవర టీం ఎలాంటి ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు

గొప్పవిషయం ఏంటంటే పాన్ ఇండియా లెవల్లో ఏ సినిమా విడుదలైనా దాని కలెక్షన్స్ ని గ్రాస్ కలెక్షన్స్ రూపంలోనే చెబుతారు. కాని దేవర టీం నెట్ కలెక్షన్స్ రూపంలోనే ఎనౌన్స్ చేస్తుంది. ఎవరూ షేర్ తీసుకోకుండా వచ్చే గ్రాస్ కలెక్షన్సే అసలైనవి, కాని నిర్మాతలకు వచ్చే షేర్ కలెక్షన్స్ అయిన నెట్ వసూల్లనే ఫిల్మ్ టీం ఎనౌన్స్ చేస్తోంది

ఏదేమైనా, 792 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే 800 కోట్ల క్లబ్ లో దేవర అడుగుపెట్టడానికి 8కోట్లొస్తే చాలు… ఇక సద్దలు బతుకమ్మ, మధ్యలో నవమి, తర్వాత దశమి, ఇలా అసలైన పండగ సీజన్ కాబట్టి, తెలంగాణలో దేవర ఈ రెండు రోజుల్లోనే దుమ్ముదులిపేలా వసూల్లు రాబట్టే ఛాన్స్ ఉంది. సో 3 రోజుల్లో 200 కోట్ల వసూళ్లు పెద్ద విషయమే కాదు. కాబట్టి శుక్ర వారం 992 కోట్ల వరకు వసూల్లు వచ్చే ఛాన్స్ ఉంది.

అలా చూసినా శనివారం మొదటి ఆట పడగానే దేవర 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు దేవర టీం కలెక్షన్స్ తాలూకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వకూడదనుకుందా? లేదంటే మరే కారనమైనా ఉందో కాని, ఓవైపు వసూల్ల వరద దుమ్ముదులుపుతోంది దేవర మూవీ.

ఐతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాత్రం దేవర వసూళ్ల విషయంలో కాస్త డిసప్పాయింట్ గా ఉన్నాడట. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఓ తెలుగు సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలైన 2 వారాల్లో 1000 కోట్ల వసూళ్లు రాబడితే, అదో చరిత్ర… రికార్డు.. అద్భుతం… అలాంటిది ఇంతగా దేవర దుమ్ముదులుపుతున్నా తారక్ కొంత డిసప్పాయింట్ అవటానికి రీజన్ ఉంది

అదే యూఎస్ లో 200 కోట్ల వరకు వసూళ్లని ఎక్స్ పెక్ట్ చేశాడట.. కాని 12 రోజుల్లో అక్కడా 130 కోట్ల వసూళ్లే వచ్చాయి. తమిల, మలయాళ మార్కెట్ లో 30 కోట్ల వరకే వసూల్లు రావటంతో, అక్కడ సరిగా సినిమాను మార్కెట్ చేయలేకపోయారనే నిరుత్సాహం తారక్ లో కనిపిస్తోందట. కొరటాల శివ, అండ్ టీం మీద ఈవిషయంలో తన అసహనాన్ని సున్నితంగా తెలిపాడట తారక్. దీంతో బాహుబలి 2 రికార్డైన 1850 కోట్ల రేంజ్ లో దేవర వసూల్లని తారక్ ఎక్స్ పెక్ట్ చేశాడా అంటే, ఏమో దేవర 2 వచ్చి ఆరికార్డు క్రియేట్ చేయొచ్చేమో…కాని బాహుబలి అంటూ ఒకటి వచ్చాకే బాహుబలి 2 కి ఆరేంజ్ లోవసూళ్లొచ్చాయి. కాబట్టి దేవర సునామీ తర్వాత దేవర 2 అద్భుతాలు చేయ్యొచ్చేమో అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఐతే బాహుబలి2 కి దర్శకుడు, కథ, మల్టీస్టారర్ కాస్ట్ అన్నీ కలిశాయి. కాని దేవరకి అన్నీ తానై ఎన్టీఆరే సినిమా భారం మోసాడు. ఓరకంగా తనకున్న క్రేజ్ తో దర్శకుడిని కూడా గట్టెక్కించాడు… అందుకే తనది ఒంటిర సాహసంగా ఫీల్ అవుతున్నాడట తారక్.