రాజమౌళి ఎమోషనల్ అయ్యారు. ట్వట్టర్ వేదికగా ఓ లెటర్ ని కూడా పోస్ట్ చేశారు. “ఎవరు అవునన్నా.. కాదన్నా.. ! ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా..! ఆస్కార్ రేంజ్ సీన్ ఉందని అనుకున్నా.. అనుకోకున్నా..! ట్రిపుల్ ఆర్ తో ఓ తెలుగోడు ఆస్కార్ నామినేషన్ అఫీషియల్ లిస్టు కెక్కారు. అఫీషియల్ ఎంట్రీలో ఇండియా నుంచి మొండి చేయి ఎదురైనా.. తన ప్రయత్నం తనే చేసుకున్నారు. కసి తీరా క్యాపెయిన్ చేసి.. ఆస్కార్ నామినేషన్స్ షార్ట్ లిస్టులోకెక్కారు. ఫైనల్గా ఆస్కార్ నామినేషన్లో చోటు కూడా సంపాదించుకున్నారు. చరిత్ర పుటల్లో తన పేరును … తన సినిమా పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు”.
అవును.. ఎన్నో అంచనాల నడుమ.. మరెన్నో భావోద్వేగాల నడుమ.. ఎట్టకేలకు ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది ట్రిపుల్ ఆర్ . బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. లేడీగాగా హోల్డ్ మై హ్యాండ్.. డెయిన్ వారెన్ అప్ల్యూస్.. రిహానా.. లిఫ్ట్ మీ అప్ సాంగ్స్‌తో పాటు నిలిచి అవార్డు కోసం ఈ ఇంటర్నేషనల్ పాపులర్ సాంగ్స్‌తో సమానమైనస్థాయిని సంపాదించుకోబోతుంది. తెలుగోడి ప్రతిభను ప్రపంచానికి చాటేలా గుర్తింపు తీసుకొచ్చింది. ఇక తాజాగా RRR ఈ సూపర్ డూపర్ ఫీట్ సాధించడంతో రాజమౌళి కాస్త భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తుంది. ఒక నోట్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తన పెద్దన్న కీరవాణి కంపోజ్ చేసిన తన సినిమానలోని పాటకు ఆస్కార్ నామినేషన్ లో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. నా మనసులో తారక్, చరణ్ ల కన్నా ఎక్కువగా నాటు నాటు డ్యాన్స్ చేస్తున్నా అని లెటర్ లో కోట్ చేశారు జక్కన్న. అంతేకాదు నాటు నాటు పాట కోసం కష్టపడ్డ ప్రతిఒక్కరినీ ప్రశంసించారు. సాహిత్యం సమకూర్చిన చంద్రబోస్ దగ్గర నుంచి పాటపాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ వరకు అందరినీ అభినందించారు. తన కొరియోగ్రఫీతో పాటకు మరింత అందంగా రూపుదిద్దిన డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ నుంచి ఈ సాంగ్ కోసం బ్యాక్ ఎండ్ లో కష్ట పడిన తన కుమారుడు కార్తీక్ వరకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి గురైయ్యారు.