మెకానిక్ రాకీ రివ్యూ… ఇది కూడా పోయినట్టే

యంగ్ హీరో... మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్' మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మెకానిక్ రాకీ’ రిలీజ్ అయిపోయింది. సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయిన విశ్వక్సేన్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 02:25 PM IST

యంగ్ హీరో… మాస్ కా దాస్ ‘విశ్వక్ సేన్’ మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మెకానిక్ రాకీ’ రిలీజ్ అయిపోయింది. సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయిన విశ్వక్సేన్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. యంగ్ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా చేసారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే విశ్వక్ సేన్… ఈ సినిమాతో హిట్ కొడతాడని అతని ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఎదురు చూసారు.

కాని సినిమా చూసిన ఆడియన్స్ కు ఫ్యాన్స్ కు రక్త కన్నీరు కారింది అనే చెప్పాలి. థ్రిల్ల‌ర్ క‌థ‌తో విశ్వ‌క్‌సేన్ చేసిన తాజా మూవీ మెకానిక్ రాకీ బోరింగ్ అంటూ ఆడియన్స్ తేల్చేసారు. రాకేష్ అలియాస్ రాకీ బీటెక్‌ను మ‌ధ్య‌లోనే ఆపేసి.. అతని తండ్రి… మ‌ల‌క్‌పేట‌లో నిర్వ‌హించే ఆర్‌కే గ్యారేజెస్‌లో మెకానిక్‌గా జాయిన్ అయి… డ్రైవింగ్ పాఠాలు స్కూల్ కూడా నడుపుతూ ఉంటాడు. రాకీ గ్యారేజీ స్థ‌లాన్ని దొంగ ప‌త్రాలు సృష్టించి రంకిరెడ్డి (సునీల్‌) అనే రౌడీ ఆక్ర‌మించుకోవాల‌ని ప్రయత్నం చేస్తాడు. రంకిరెడ్డి నుంచి త‌న స్థ‌లాన్ని కాపాడుకోవ‌డానికి రాకీకి యాభై ల‌క్ష‌లు కావాల్సి ఉంటుంది.

ఈ కబ్జా స‌మ‌స్య నుంచి మాయగా నటించిన శ్రద్దా శ్రీనాథ్ సాయంతో గ‌ట్టెక్కాల‌ని రాకీ ప్లాన్ చేస్తాడు. కాలేజీ రోజుల్లోనే రాకీ ప్రేమించిన ప్రియ గా యాక్ట్ చేసిన మీనాక్షి చౌద‌రి… మ‌ళ్లీ డ్రైవింగ్ పాఠాలు నేర్చుకోవ‌డానికి రాకీ ద‌గ్గ‌ర‌కు రాగా అక్కడి నుంచి అతని జీవితం మలుపులు తిరుగుతుంది. 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్‌తో రిలీజైన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ దారుణంగా ఉంది. కాని… ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్ లో కొన్ని ట్విస్ట్ లు మాత్రం ఓ రేంజ్ లో ప్లాన్ చేసారు. యాక్టింగ్ విషయంలో విశ్వక్ సేన్ దుమ్ము రేపాడు. అతని కోసం ఈ సినిమా చూడవచ్చు.

జేక్స్ బిజోయ్ మ్యూజిక్ పర్వాలేదు అని చెప్పవచ్చు. కామెడి ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో కామెడి రాడ్ అనిపించింది. సినిమా కథను సాగదీయడంతో… జనాలు ఎప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూసారు. అసలు కథ మాత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ తో సెకండాఫ్‌లో బాగా ప్రెజెంట్ చేసారు అని చెప్పవచ్చు. సినిమా మిక్సడ్ టాక్ తో వన్ టైం వాచ్ గా చెప్పవచ్చు. ఆడియన్స్ మాత్రం ఓపికగా సినిమా చూడాలి. థియేటర్లో కంటే ఓటీటీలో ఈ సినిమాను చూడవచ్చు. హీరోయిన్లు గ్లామర్ తప్పించి పెద్దగా ఏం లేదు అనే టాక్ వస్తోంది.