పేటిఎంలో 1 మిలియన్, బుక్ మై షోలో 7 లక్షల మంది వెయిటింగ్, దేవర టికెట్ లెక్క

టాలీవుడ్ లో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల లెక్క వేరు దేవర లెక్క వేరు. సినిమా విడుదల అంటే ఈ రేంజ్ లో ఉండాలని టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్ లకు చెప్తోంది దేవర. ప్రమోషన్ తో సంబంధం లేకుండా సినిమాపై హైప్ భారీగా క్రియేట్ అయింది.

  • Written By:
  • Publish Date - September 24, 2024 / 06:22 PM IST

టాలీవుడ్ లో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల లెక్క వేరు దేవర లెక్క వేరు. సినిమా విడుదల అంటే ఈ రేంజ్ లో ఉండాలని టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్ లకు చెప్తోంది దేవర. ప్రమోషన్ తో సంబంధం లేకుండా సినిమాపై హైప్ భారీగా క్రియేట్ అయింది. ఓవర్సీస్ లెక్కలు చూస్తే సినిమా కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో స్పష్టంగా చెప్పవచ్చు. ఎన్టీఆర్ కు క్రేజ్ ఉంది… కానీ ఈ రేంజ్ లో క్రేజ్ ఉందని ఎవడూ ఊహించలేదు. సినిమా విడుదల అంటే ఈ రేంజ్ లో ఉంటుందని కల కూడా కనలేదు.

మూడు రోజులు ఉండగానే అమెరికాలో 2 మిలియన్ వసూళ్లు దేవర ప్రీ బుకింగ్ లో సొంతం చేసుకుంది అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అవుతోంది. బెనిఫిట్ షోస్ కోసం ఇప్పటి నుంచే పోటీ మొదలయింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జనాలు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో కూడా సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అవుతోంది. దీనితో హిందీ లో కూడా వసూళ్లు భారీగా ఉంటాయని సినిమా పండితులు లెక్కలు వేస్తున్నారు.

అయితే మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు. సినిమా కోసం పేటిఎం నోటిఫికేషన్ కోసం 1 మిలియన్ మంది ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ వస్తే టికెట్ బుక్ చేసుకుందాం అని… అలాగే బుక్ మై షో లో 7 లక్షల నుంచి 8 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అంటే ఈ రెండు యాప్స్ లోనే దాదాపుగా 18 లక్షల మంది టికెట్ కోసం చూస్తున్నారంటే వేరే యాప్స్ లో ఏ రేంజ్ లో ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు, వాకిన్స్ ఎన్ని ఉండవచ్చు బుక్ మై షో, పేటిఏం అన్ని ప్రాంతాల్లో లేవు… నగరాలకు మాత్రమే పరిమితం. మరి మిగిలిన యాప్స్ పరిస్థితి ఎలా ఉండవచ్చు…? ఇది దేవర సృష్టిస్తున్న సరికొత్త చరిత్ర.