దేవర సీన్ లో కి వస్తే వార్ వన్ సైడ్ అన్నారు. అన్నట్టే జరిగింది. పోటీకి సౌత్ నార్త్ లో పెద్ద మూవీలేవి రాలేదు. అంత ధైర్యం చేయలేదు. ఆతర్వాత వచ్చిన వెట్టయాన్ కూడా గట్టెక్కింది లేదు. అచ్చంగా అలానే పుష్ప 2 వస్తోందంటే, సౌైత్, నార్త్ ఎక్కడా పోటీ అనేదే ఉండదన్నారు. కాని ఉంది.. పోటీ ఇచ్చేందుకు సీన్ లోకి హిందీ మూవీ చావా వస్తోంది. పుష్ప లాంటి ఊరమాస్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి… అయినా అడ్డు గోడగా నిలుచునే ధైర్యం చేస్తోంది చావా… ఇది మరే పాన్ ఇండియా మూవీ అయినా పుష్ప2 కి పోటీ అని ఎవరు అనుకునేవాల్లు కాదు.. కాని చావా మూవీ కంటెంట్ కి నార్త్ ఇండియా లో ఎమోషనల్ కనెక్షన్ ఉంది. కాబట్టే 999 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ అయినా, ఈసారి నార్త్ ఇండియాలో పుష్పరాజ్ కి ఏది అంత ఈజీ కాదంటున్నారు. ఇంతకి చావా ఎలా పుష్ప2 కి పోటీ అయ్యేఛాన్స్ ఉంది? ఆ ఎమోషనల్ కనెక్షన్ ఏంటి?
పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. విడుదలకు ముందే 999 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందిఈ సినిమా… అంతేకాదు 11500 థియేటర్స్ లో పుష్ప2 రాబోతోందనగానే, ఈసునామీలో మరే మూవీ అయిన కొట్టుకుపోవాల్సిందే అన్నారు. కాని బాలీవుడ్ నుంచి చావా మూవీ పుష్పరాజ్ సునామీని తట్టుకోవటం కాదు, ఎదురు పోటీ ఇచ్చేలా ఉంది. పుష్ప లాంటి హిట్ కి సీక్వెల్ గా పుష్ప 2 వస్తోందంటే, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవటం కామన్..
కాని పుష్ప 2 కి హిందీ మార్కెట్ లో మాత్రం ఏది అంత ఈజీ కాదని షాక్ ఇచ్చేలా ఉంది చావా మూవీ.
నార్త్ ఇండియాలో మాస్, క్లాస్, రొమాన్స్ ఇలా ఏ జోనర్ లో ఎవరుమూవీ తీసినా ఓకే…కాని డివోషనల్ గా లేదంటే, జమనా యుధ్దకాలం తాలూకు సినిమాలొస్తే, వాటికి ఛత్ర పతి శివాజీ మహరాజ్ కనెక్షణ్ ఉంటే అది సినీ సునామే…
అలాంటి కనెక్షన్ లోనే ఛావా మూవీ వస్తోంది. చావా అంటే మరాఠాలో సింహం పిల్ల అని అర్ధం… ఇది మరాఠా చక్రవర్తి చత్రపతి శివాజీ పెద్ద కొడుకు చత్ర పతి శంబాజీ బయోపిక్ గా వస్తోంది. ఈ బయోపిక్ లో చావాగా విక్కీ కౌశల్ కనిపించబోతున్నాడు. టీజర్, ట్రైలర్ పేలింది. నార్త్ ఇండియా ఊగిపోయేలా ఉంది.
సో డివోషనల్ మూవీల్లో రాముడి, కృష్ణుడి జీవిత గాథలు ఏమాత్రం క్వాలిటీ మేకింగ్ తో వచ్చినా నార్త్ ఇండియా అంతటా పూనాకాలొస్తాయి.. ఆతర్వాత మరాటా యోధుల మీద మూవీలు వస్తే, అవి ఏమాత్రం బాగున్నా, బాక్సాఫీస్ పీస్ పీస్ అవ్వాల్సిందే… కాబట్టే చావా మూవీని పుష్ప 2 లైట్ తీసుకునే ఛాన్స్ లేదు
పుష్ప 2 డిసెంబర్ 5 న వస్తుంటే, మరుసటి రోజు చావా రాబోతోంది. ఈసీనిమా సౌత్ ఇండియాలో పుష్ప2 కి పోటీ ఇవ్వటం కాదు, అసలు దరి దాపుల్లోకి కూడా రాదు. కాని నార్త్ ఇండియా మార్కెట్ లో చావా ఖచ్చితంగా పుష్ప 2 వసూళ్లను చీల్చే చాన్స్ ఉంది. చావా మీద పెరుగుతున్నహైప్, ప్రకారం చూస్తుంటే, డెఫినెట్ గా క్రిస్మస్ సీజన్ లో పుష్ప2 వర్సెస్ చావా అనక తప్పదు. ఒకవేల కర్మకాలి చావా సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాకొచ్చినా, పుష్ప 2 వసూల్లు తగ్గే ఛాన్స్ ఉంది. పుష్ప 2 హిట్ టాక్ వచ్చినా, నార్త్ ఇండియా మార్కెట్ లో చావా వల్ల వసూళ్లు చీలి పోతే, డెఫినెట్ గా అది నష్టమే..
అసలే టాలీవుడ్ కంటే రెండింతల మార్కెట్ ఉన్న బాలీవుడ్ లో చావా వల్ల వసూళ్లు చీలితే పుష్ప2 కి చెప్పలేనంత డ్యామేజ్ జరిగే ఛాన్స్ఉంది. కాకపోతే, అది ఎమోషనల్ డ్రామా, పుష్ప 2 ఊరమాస్ యాక్సన్ డ్రామా… అలాచూస్తే దేనికదే రెండూ హిట్ అయ్యి వసూల్ళ వరద తెచ్చే ఛాన్స్ఉంది. కాని వార్ మాత్రం వన్ సైడ్ అనే సీన్ నార్త్ ఇండియాలో మాత్రం లేదు.