దసరా లోపే 1000 కోట్లు… మండే అన్ని టెస్ట్ లు పాస్..

బరిలేక దూసుకెళుతున్న ఒంగోళు గిత్తలా దేవర దూసుకెలుతున్నాడు...ఓపెనింగ్స్ 172 కోట్లు వచ్చాక, రెండో రోజు నుంచి టాక్ వీక్ అన్నారు. కాని తమిళ తంబీలు బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి్ మూవీలనే ఏదోచూసామంటే చూశారు.. ఇక మన పాన్ ఇండియా ప్రయోగాలనేం చూస్తారు...కాని తెలుగు, హిందీ వర్షన్ దేవరకి వస్తున్నాయి వసూళ్ల వరదలే వరదలు..

  • Written By:
  • Updated On - October 3, 2024 / 09:14 AM IST

బరిలేక దూసుకెళుతున్న ఒంగోళు గిత్తలా దేవర దూసుకెలుతున్నాడు…ఓపెనింగ్స్ 172 కోట్లు వచ్చాక, రెండో రోజు నుంచి టాక్ వీక్ అన్నారు. కాని తమిళ తంబీలు బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి్ మూవీలనే ఏదోచూసామంటే చూశారు.. ఇక మన పాన్ ఇండియా ప్రయోగాలనేం చూస్తారు…కాని తెలుగు, హిందీ వర్షన్ దేవరకి వస్తున్నాయి వసూళ్ల వరదలే వరదలు.. రోజుకి 26 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వసూళ్ల పెరుగుతదల కనిపిస్తోంది. అంటే ఇవాళ 30 కోట్లొస్తే, మరుసటి రోజుకి 56 కోట్లు.. ఇలా వసూళ్ల వరదలో పెరుగుదల మతిపోగొడుతోంది. ఏమైనా వసూళ్ళా ఇవి అని బాలీవుడ్డే షాకౌతోంది. దీనికి తోడు దసరా దరువు… మొత్తం హాలీడేస్ మూడ్ రావటంతో, ఈ పది పన్నెండు రోజులు దేవర విశ్వరూపం బాక్సాఫీస్ ని షేక్ చేసేలా ఉంది. ఇప్పుడున్న వసూళ్ల లెక్కలు చూస్తుంటే, 1000 కోట్ల క్లబ్ లోకి దసరా పండక్కి ఒకరోజు ముందే అడుగుపెట్టేలా ఉన్నాడు దేవర.

దేవర మొదటిరోజు 172 కోట్లు రాబడితే, రెండో రోజు 80 కోట్లు రాబట్టింది. మూడో రోజు 100 కోట్లు…అంటే మూడు రోజుల్లోదాదాపు 250 నుంచి 300 కోట్ల గ్రాస్ 250 కోట్ల నెట్ వచ్చేశాయి… ఇక మండే తోపాటుమంగళ వారం వసూళ్లతో ఈ సనిమ390 కోట్లని చేరింది. ఓవరాల్ గా వసూళ్లలో అప్స్ అండ్ డౌన్స్ కనిపించాయి. దీనికి కారణం, తమిళనాడు, కేరళ లో వసూళ్ల విషయంలో కొన్న కన్ ఫ్యూజన్ కనిపిస్తున్నాయి. కర్ణాటకాలోనే ఓపెనింగ్స్ ఉన్నంతగా తర్వాత వసూళ్లు లేవు. కట్ చేస్తే సోమవారం, మంగళవారం వసూళ్లు తమిల, మలయాళ, కన్నడ వర్షన్స్ తో పెరుగుతున్నాయి. రోజుకి అక్కడ 2 నుంచి 3 కోట్ల వసూళ్ళ పెరుగుదల ఉంది..

ఈమాత్రానికే సంతోషపడాలా అంటే, ఎందుకో తమిళ, మలయాళ మార్కెట్లో ఏ తెలుగు హీరో సినిమా అయానా, మొదటి రోజునుంచే వసూళ్ల వరద రావటం అరుదు… బాహుబలి టైం నుంచే ఇది జరుగుతోంది. కాకపోతే టాక్ కిక్ ఇస్తే, మాత్రం సినిమా విడుదలైన రెండు మూడు రోజుల తర్వాత వసూల్ల వరద నిదానంగా పెరుగుతుంది. కాని తెలుగు రాష్ట్రాల్లోదేవర వసూళ్లకు పూనకాలొచ్చాయి… నార్త్ ఇండియాలో ఇది బిగ్గెస్ట్ హిట్ గా మారిపోతోంది.

తెలుగు, హిందీ మార్కెట్ లో దేవర మూవీ ఎక్కువ శాతం మాస్ మతిపోగొడుతోంది. ఫలితంగానే, తమిళ, మలయాళ, కన్నడ మార్కెట్లో దేవర వసూళ్ల మార్పులు మొదలయ్యే లోపు ఈ సినిమా గ్రాఫ్ కాస్త పడిపోయినట్టే కనిపించింది. కాని హిందీ మార్కెట్ లో మొదటి రోజు 8 కోట్లు, రెండోరోజు 11 కోట్లు, మూడో రోజు 13 కోట్లు, సోమవారం ఏకంగా 17 కోట్లు, మంగళవారం 20 కోట్లువచ్చాయి. అంటే గ్రాడ్యూయెల్ గా అక్కడా 2 నుంచి 5 కోట్ల వసూళ్ల పెరుగుదల కనిపిస్తోంది. రోజు రోజుకి నార్త్ ఇండియా మాస్ మతిపోగొడుతోంది దేవర

విచిత్రం ఏంటంటే డిసెంబర్ లో వచ్చే పుష్ప 2, గేమ్ చేంజర్ వరకు మరో పాన్ ఇండియా మూవీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇక దేవరకే పండగ అనుకునే టైంలో, దసరా ఫెస్టివల్ వస్తోంది. ఆల్రెడీ తెలుగు, రాష్ట్రాల్లో పండగ సెలవుల దరువు పెరిగింది. అంతే ఇక అడ్డు అదుపు లేకుండా, దేవర వసూళ్ల వరద, మతిపోగొట్టేలా ఉంది. వెయ్యికోట్ల వరద రావాలంటే కనీసం నెలైనా టైం కావాలన్నారు. కాని దసరాకి ఒకరోజు ముందే వెయ్యికోట్ల కలెక్సన్స్ ని దేవర రీచ్ అయ్యేలా ఉన్నాడు

పుష్ప 2, గేమ్ ఛేంజర్ మూవీలకు దేవర నిజంగా ఓ పెద్ద నెంబరే ఛాలెంజ్ గా సెట్ చేసేలా ఉన్నాడు. ఆల్రెడీ 5 రోజుల్లో 390 కోట్లంటే, ఈజీగా ఈ వారంలో 600 నుంచి 800 కోట్ల వసూళ్ల వరకు దేవర దూకుడు కన్ఫామ్ అయ్యేలా ఉంది. 12 కి ఒకరోజు ముందు అంటే 11 న వెయ్యికోట్ల క్లబ్ లో దేవర చేరేలా ఉన్నాడు. నార్త్ ఇండియా లో దేవర స్పీడ్ చూస్తుంటే, వెయ్యికోట్ల వరకే దేవర దరువు ఉండేలా లేదు. అంతకమించి 1500 కోట్ల క్లబ్ వైపు కూడా దేవర అడుగులుపడేలాఉన్నాయి.

వింతేంటంటే రివ్యూలు, యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు ఎంతగా సినిమాను డ్యామేజ్ చేస్తాయో అనుకుంటున్న వేల, కో అంటే కోట్ల వసూళ్లొస్తున్నాయి.. దేవర అంతగా మాస్ పల్స్ ఎలా పట్టుకున్నాడనే ప్రశ్న ఎదురౌతోంది. మాస్ ఆడియన్స్ కి సినిమా ఎక్కితే, ఇంత సునామీలా రెస్పాన్స్ ఉంటుందనే విషయం సినీ జనానికి అర్ధమౌతున్నా, అలా ఎలా మాస్ పల్స్ దేవర పట్టేశాడో మాత్రం హిందీ ఫీల్మ్ మేకర్స్ కి అర్ధం కావట్లేదు. అందుకే మొన్నటి వరకు దేవర ఏం సినిమారా బాబు, అందులో ఏముంది అని నీలిగిన బీటౌన్ యాంటీ బ్యాచ్, ఇప్పుడు కనీసం నోరు విప్పట్లేదు, చిన్న నెగెటీవ్ కామెంట్ కూడా కనిపించట్లేదు.