1000 కోట్ల రెబల్ స్టార్ సినిమాలో… 1000 కోట్ల హీరోలు..

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 తో 1850 కోట్లు, బాహుబలి 1 తో 550 క్ట్లు మొత్తంగా 2400 కోట్లు రాబట్టాడు. తర్వాత సలార్ తో 750 కోట్లు, కల్కీతో 12000 కోట్లు రాబట్టాడు. ఇలా ఐదు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు, రెండు సార్లు వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టిన రికార్డులు ఎకౌంట్ లో వేసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - October 19, 2024 / 02:54 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 తో 1850 కోట్లు, బాహుబలి 1 తో 550 క్ట్లు మొత్తంగా 2400 కోట్లు రాబట్టాడు. తర్వాత సలార్ తో 750 కోట్లు, కల్కీతో 12000 కోట్లు రాబట్టాడు. ఇలా ఐదు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు, రెండు సార్లు వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టిన రికార్డులు ఎకౌంట్ లో వేసుకున్నాడు. అలాంటి ఈ కటౌట్ కి మరో ఇద్దరు వెయ్యికోట్ల స్టార్స్ తోడైతే ఎలా ఉంటుంది. నిజంగా ఇది జరగబోతోంది. మొన్నటి వరకు ఇండస్ట్రీ లీకుల్లో మాత్రమే ఇలాంటి మాటలు వినిపించాయి. ఇలానే కొరియా విలన్ అని కూడాగుసగుసలొచ్చాయి. విచిత్రం ఏంటంటే ఇవన్నీ నిజమయ్యేలా ఉన్నాయి. రెండో సారి రెబల్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి రౌడీ స్టార్ రెడీ అయ్యాడు. సీన్ లోకి బాలీవుడ్ యానిమల్ అడుగుపెడుతున్నాడు. ఫస్ట్ టైం ఇండియాలో లోకేష్ కనకరాజ్ తర్వాత సినిమాటిక్ యూనివర్స్ తో పాన్ ఇండియా స్టార్లను వెండితెరమీదకు వదలబోతున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ..

రెబల్ స్టార్ సలార్ తో లాస్ట్ ఇయర్ 750 కోట్లు రాబట్టాడు. ఈ ఏడాది కల్కీతో 1200 కోట్లు రాబట్టాడు.. ఇక ఏప్రిల్ లో ది రాజా సాబ్ రిలీజ్ అవుతోందంటే, అదో వెయ్యికోట్లు ఈజీగా రాబడుతుంది. టాక్ కిక్ ఇస్తే వెయ్యికోట్లు కాస్త 1500 కోట్లనుంచి 2 వేల కోట్లను రీచ్ అయ్యే ఛాన్స్ఉంది.
అంతా బాగా నడుస్తోంది. ఇలాంటి టైంలో వెయ్యికోట్ల స్టార్ కి మరో వెయ్యికోట్ల స్టార్ తోడైతే ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది

అదే సందీప్ రెడ్డి సినిమాటిక్ యూనివర్స్.. ఈ డైరెక్టర్ ఇప్పటి వరకు అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేశాడు. కబీర్ సింగ్ అంటూ దాన్నే హిందీలో రీమేక్ చేశాడు. యానిమల్ అంటూ రణ్ బీర్ కపూర్ తో 900 కోట్ల వసూళ్లు రాబట్టాడు.

ఇప్పుడు రెబల్ స్టార్ తో 1000 కోట్ల బడ్జెట్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు. 2025లో మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ రెబల్ స్టార్ డ్యూయెల్ రోల్ వేస్తున్నాడు. పోలీస్ గా, డాన్ గా రెండు అవతారాలెత్తుతున్నాడు. అలాంటి ఈ మూవీలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, హిందీ స్టార్ రణ్ బీర్ కపూర్ ఉంటే ఎలా ఉంటుంది..

ఇదిసౌత్, నార్త్ అంతగా మైండ్ బ్లాంక్ చేసే ఐడియా… రెబల్ స్టార్ లాంటి కటౌట్ కి మరో స్టార్ సపోర్ట్ అవసరం లేదు.. అసలు తను స్క్రీన్ మీద కొస్తే, మిగతా బ్యాచ్ కనిపించరు. అయినా అలాంటి స్టార్ కి విజయ్ దేవరకొండ, రణ్ బీర్ కపూర్లు ఏదోపాత్రలతో కాకుండా అర్జున్ రెడ్డి, యానిమల్ రోల్స్ తో కలిసి నటిస్తే భూమి బద్దలే

అర్జున్ రెడ్డి తెలుగులోనే రిలీజైనా కాని, పాన్ ఇండియా లెవల్లో రౌడీ స్టార్ కి క్రేజ్ తెచ్చిపెట్టింది. యానిమల్ తో రణ్ బీర్ కపూర్ వైల్డ్ స్టార్ గా మారిపోయాడు. మాస్ హీరోగా ఎదిగాడు. అలాంటి రెండు పాత్రలు స్పిరిట్ లో కనిపిస్తే, అదో సినిమాటిక్ యూనివర్స్ లా కిక్ ఇస్తుంది. సినీజనాలకు ఊహించని షాక్ ఇస్తుంది…ఇప్పుడు అదే జరిగేలా ఉంది. అదే జరిగితే ఈ ప్రభాస్ వల్ల ఈ సినిమాకు 2 వేల కోట్లు మిగతా పాత్ర ల వల్ల మరో వెయ్యికోట్లు యాడై, సినిమా స్థాయి 3 వేలకోట్లకు పెరగటమేకాదు, ఊహించని చరిత్ర క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే జరిగేలా ఉంది.