ఎన్టీఆర్ ఒక్కడే 510 కోట్ల షేర్ వసూళ్లు, 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దేవరని ఓ హిస్టారికల్ హిట్ గా మార్చాడు. మరీ త్రిబుల్ ఆర్, బాహుబలి రేంజ్ లో ఈ సినిమా కు కంటెంట్ తోడవ్వలేదు.. హీరోయిన్ గ్లామర్ డోసు సరిపోలేదు. విలన్ కూడా ఇరగదీసేంతగా నటించింది లేదు. ఓరకంగా చెప్పాలంటే దేవర మూవీలో సర్వం ఎన్టీఆరే తప్ప కంటెంట్ లో దమ్ము అనుకున్నంత లేదు. ఓ కత్తిలాంటి కథతో ఈజీగా ఓ అనామకుడు కూడా హిట్ మెట్టెక్కొచ్చు..కాని ఓ మాదిరి కంటెంట్ ఉన్న మూవీతో, ఊహకందని రీతిలో వసూళ్లు రాబట్టడం తేలికైతే కాదు. ఓపెనింగ్స్, ఓవర్ సీస్, విడదలైన 4 వారాల తర్వాత కూడా స్థిరమైన వసూళ్లు, ఇవన్నీ ఎన్టీఆర్ రికార్డులు… తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కోట్ల ల్లో ఉంటే, కన్నడ ప్రాంతాల్లో అదే రేంజ్ క్రేజ్ ఉంది. విచిత్రం ఏంటంటే ఈరెండు ప్రాంతాలను కలిపినా నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ ఫాలోయింగ్ తో పోల్చలేం… సౌత్ ని మించేలా నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ కి మాస్ బేస్ ఊహించని స్తాయిలో పెరిగింది. ప్రభాస్ నే ఎన్టీఆర్ మించిపోతాడా అనేంతగా దేవరతో క్రేజ్ వచ్చింది. మరి కోలీవుడ్, మాలీవుడ్ లో బోణీ ఎప్పుడు.. రియాలిటీ మాట్లాడాలంటే, దేవరకు తెలుగు, హిందీ ప్రాంతాల్లో కనిపించిన పూనకాలు, తమిల, మలయాల మార్కెట్లో మాత్రం మిస్ అయ్యాయి. ఎందుకు? ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేందుకు ఎన్టీఆర్ దగ్గరున్న మాస్ మాస్టార్ ప్లానేంటి?
ఎన్టీఆర్ దేవర సౌత్ ఫిల్మ్ మేకర్లకే కాదు, బాలీవుడ్ దర్శక నిర్మాతలకు కూడా కళ్లు తెరిపించింది. ఇండియాలో 80 శాతంకి పైనే సినిమా లవర్స్ కి ఏం కావాలో అదే దేవరటీం ఇచ్చింది. లార్జర్ దేన్ లైఫ్ అంటే వందలకోట్లు పెట్టుబడి పెట్టడం కాదు, వందలకోట్ల మందికి నచ్చే ఎమోషనల్ కంటెంట్ కావాలని… అదే దేవరలో ఉంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలతో పాన్ ఇండియా మొత్తం కనెక్ట్ అయ్యింది. ఫలితం చూసి ఇలా సినిమాలుంటే జనాలకు నచ్చుతాయేమో అనేంతగా, హిందీ ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితొచ్చింది.
ఎంతసేపు పీజ్జా బర్కర్ లాంటి కథలే కాని, మాంచి బిర్యానీ లాంటి దమ్మున్న కథవైపు హిందీ ఫిల్మ్ మేకర్స్ అడుగేయలేదు. కనీసం మాంచి పప్పన్నం పెట్టినట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయలేదు. చపాతీకి చట్నీ వేసి కానిచ్చేయండి అన్నారు. అలా ఉన్నా పర్లేదు కాని, మరీ బ్రెడ్డు ముక్కిచ్చి దానికి జామ్ పూసుకు తినంటే ఎలా? హిందీ సినిమాల్లో చూపించినట్టు నార్త్ ఇండియాన్స్ ఏం బ్రెడ్డు బటరూ జామ్ లతో లంచ్ లు డిన్నర్లు చేయరు.. ఏదో ముంబై, డిల్లీ లేదంటే రిచ్ బ్యాచ్ ఉండే గల్లిలో ఇలా తింటారేమో.. అంత మాత్రానికి వాళ్లుతినేదే మిగతా వాళ్లకి పెడితే, ఏం ఎక్కుతుంది..
సౌత్ లో అన్నం, నార్త్ లో చపాతి… కాని కామన్ గా కారం, మసాలతో నిండే కర్రీ… ఎక్కడైనా ఉప్పుకారం దట్టించాల్సిందే.. అదే లేకపోతే, చప్పిడి చపాతి వాళ్ల వాళ్లకూడా కాదు. అదే హిందీ సినిమా ఇచ్చింది. సౌత్ సినిమా మాత్రం ధమ్మున్న ఘాటైన ఫుల్ మీల్స్ నార్త్ ఆడియన్స్ కి అందిస్తోంది..
దేవర మూవీతో సౌత్ ఇండియన్స్ కి ఫుల్ మీల్స్, నార్త్ ఇండియన్స్ కి చపాతీ తాలీ దొరికినట్టైంది. ఆటోవాలాలు, కార్ వాలాలు, మజ్దూర్ లో దేవర మూవీకి ఇంకా అక్కడ ఫిదా అవుతూనే ఉన్నారు.ఇదే హిందీ దర్శకులని ఆలోచనల్లో పడేస్తోంది. ఇంతవరకు బానే ఉంది. తెలుగులో ఎన్టీఆర్ క్రేజ్ వేరు కాబట్టి ఇక్కడ తన సినిమాలొస్తే ఫ్యాన్స్ లోపూనకాలొస్తాయి… కన్నడలో భారీగా తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ మాస్ క్రేజ్ ఏరేంజ్ లో ఉందో దేవరతో బయటపడింది.
చాలా మందికి మొదట్లో డైజెస్ట్ కాలేదు కాని, దేవర నార్త్ ఇండియా వసూల్లు చూశాకే, ఎన్టీఆర్ మ్యాజిక్ వాళ్లకు అర్ధమౌతున్నట్టుంది. తెలుగు, కన్నడ, హిందీ మార్కెట్లో ఎన్టీఆర్ క్రేజ్ బానే ఉంది. కాని తమిల్, మలమాళం అంతగా కనిపించట్లేదు. అంటే అక్కడా దేవర బానే ఆడింది కాని, తెలుగు, కన్నడ, హిందీ మార్కెట్ లో వచ్చినంత రెస్పాన్స్ రాలేదు. దానికి కారనం కావాల్సినంతగా అక్కడ దేవరని ప్రమోట్ చేయకపోవటం, ఇంకా చెప్పాలంటే బేసిగ్గానే తమిళ తంబీలు పొరుగింటి స్టార్లను అంతగా ఎంకరేజ్ చేయరు
మలయాళీస్ మాత్రం అల్లు అర్జున్ నే కాదు, ఎన్టీఆర్, ప్రబాస్ ఇలా అందరినీ ఆదరించారు. కాకపోతే ఫార్ములా మూవీస్ తో కాకుండా, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలే అక్కడ ఎక్కువ ఆడుతాయి… అందుకే ఎన్టీఆర్ వార్ 2 మూవీని తమిళ్, మలయాళం మార్కెట్ లో స్పెషల్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడట. తమిళ్ లో తానే డబ్బింగ్ చెప్పుకునే తారక్, మలయాళం వర్షన్ కి కూడా తానే డబ్ చేస్తానంటున్నాడు. డ్రాగన్ మూవీలో తమిళ,మలయాళం నటుల సంఖ్యని పెంచటమే కాదు, తమిళ కవిత్వాని సినిమాలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడట. ఇలాంటి చిన్న చిన్న మార్పులే, బాక్సాఫీస్ లో కొత్త కొత్త మార్కెట్లని యాడ్ చేస్తాయి.. దేవరతో నార్త్ ఇండయా రూరల్ ఏరియా కనెక్ట్ అయినట్టు, వార్ 2, డ్రాగన్ తో తమిల, మలయాళ మార్కెట్లు ఎన్టీఆర్ కొల్లగొట్టే ఛాన్స్ ఉంది.