పుష్ప 2 వేగంగా వెయ్యికోట్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసిందంటున్నారు. కాని ఆరో రోజు వసూళ్లు చూస్తే ఊహాతీతంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. మరీ 60 శాతం వసూళ్లు ఆవిరయ్యాయి… విడుదలైన 6 రోజుల్లో వెయ్యికోట్లు రాబట్టిన మూవీ అంటే ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అలాంటి క్రేజ్ ఉన్న మూవీ మ్యూజిక్ కేవలం 6 రోజుల్లోనే తగ్గిపోతుందా? ఇదే ఎవరికీ అర్ధం కావట్లేదు. దీనికితోడు ఓవర్ సీస్ లో కూడా 5 రోజుల్లో పది మిలియన్లు రాబట్టిన పుష్ప2 అన్నారు. కట్ చేస్తే ఆరో రోజు అర మిలియన్ కూడా వసూల్లు రాలేదు. ఎక్కడ తేడా కొడుతోంది. మండే కలెక్షన్స్ తగ్గాయంటే అర్ధం ఉంది.. కాని మంగళవారం వసూళ్లు డ్రాప్ అయ్యాయంటేనే వసూళ్ల లెక్కల మీద డౌట్లు మరింత పెరుగుతున్నాయి.
పుష్ప 2 వసూళ్లు మీద నిర్మాతలు వదులుతున్న పోస్టర్లు కాసేపు నిజమే అనుకుందాం… ఇదేదో ప్రోపెగాండా, కార్పోరేట్ వసూళ్ల దొంగలెక్కలని ఎక్కడా కన్ఫామ్ కాలేదు. పుష్ప2 కి జనాల్లో క్రేజ్ ఉంది. కాబట్టే వసూళ్ల వరదొచ్చిందని నమ్మొచ్చు. కాని నిర్మాతలు ఇస్తున్న వసూళ్ల లెక్కలే ఇవి నిజమేనా అన్నడౌట్లకు కారణమౌతున్నాయి
పుష్ప2 ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వేగంగా వెయ్యికోట్లు రాబట్టిన మూవీ అన్నారు. అంతవరకు బానే ఉంది. కేవలం 6 రోజుల్లోనే పుష్ప2 మూవీ వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టిందన్నారు. అది కూడా బానే ఉంది. కాని ఆరో రోజెందు 60శాతం వసూళ్లు డ్రాప్ అయ్యాయో అర్ధం కాని విషయం… కేవలం సినిమా విడుదలైన ఆరోవ రోజుకే జనాల్లో క్రేజ్ తగ్గిందా?
సరే సోమవారం వసూల్లు తగ్గాయంటే వీకెండ్ క్రేజ్, మరో వీక్ బిగినింగ్ లో ఉండదనుకోవచ్చు. కాని సోమవారం వసూళ్లు బాగున్నాయి, మంగలవారం మాత్రం 150 కోట్ల నుంచి 40 కోట్ల స్థాయికి వసూళ్లు తగ్గాయి. ఆల్ మోస్ట్ వన్ బై థర్డ్ కూడా లేదు ఈ నెంబర్
ఇప్పటి వరకు వేగంగా వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టని మూవీల లిస్ట్ చూస్తే, బాహుబలి 2 మూవీ 10 రోజుల్లో వెయ్యికోట్లు రాబడితే, త్రిబుల్ఆర్, కేజీయఫ్ 2, కల్కీ ఈ ఘనతని విడుదలైన 16 రోజుల్లో అందుకున్నాయి. జవాన్ అయితే 18 రోజుల్లో పటాన్ అయితే 27 రోజుల్లో వెయ్యికోట్లను రాబట్టింది.
సో వీటితో పోలిస్తే పుష్ప 2 మూవీ 6 రోజుల్లో వెయ్యికోట్లు రాబట్టడం అంటే కొత్త రికార్డే కాదు, అదో అద్భుతం.. కాని ఆ అద్భుతం మరో పదిరోజుల తర్వాత క్రేజ్ తగ్గి, వసూళ్లతో డీలా పడిందంటే అర్దం ఉంది. కాని కేవలం ఆరు రోజుల్లోనే పుష్ప2 క్రేజ్ పడిపోయిందా? మరెందుకు ఆరోరోజు కేవలం 40 కోట్ల వసూళ్లే వచ్చాయనే డౌట్లు, అసలు వెయ్యాకోట్ల వెనక నిజమెంత అని శంకించేలా చేస్తోంది. ఇదే కాదు ఓవర్ సీస్ లో కూడా దేవర, కల్కీ, త్రిబుల్ ఆర్ లైఫ్ టైం వసూళ్లని కూడా మూడు నాలుగు రోజుల్లోనే దాటేసింది పుష్ప2 అన్నారు. 5 రోజుల్లో 10 మిలియన్ డాలర్లు కేవలం అమెరికాలోనే వచ్చాయన్నారు. కాని ఆరో రోజు అదే అమెరికాలో హాఫ్ మిలియన్ కి మించి వసూళ్లు రాలేదు. ఇదె చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది. ఆర్టీఫీషియల్ కలెక్షన్స్ ని ఎనౌన్స్ చేస్తున్నారా అన్న డౌట్లకు కారణమౌతోంది.
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ 18 రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరింది. ఆ తర్వాత పఠాన్ సినిమా 27 రోజుల్లో ఈ ఘనత సాధించి, అదే ఏడాది బాలీవుడ్‌ను రిప్రజెంట్ చేసింది. కానీ పుష్ప 2 ఈ లెక్కలన్నింటినీ కొత్త ఎత్తుకు చేర్చింది. పుష్ప 2 కోసం ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ రికార్డులను బ్రేక్ చేసే స్థాయిలో ఉంది. సుకుమార్ తన డైరెక్షన్‌తో ఈ సినిమాను పాన్-ఇండియా హిట్‌గా మార్చాడు. ముఖ్యంగా మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన, మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఈ చిత్రానికి పుష్ప 1 క్రేజ్ ఎంతగానో హెల్ప్ అయ్యింది. దీంతో హిందీలో బాక్సాఫీస్ లెక్కలు జెట్ స్పెస్ లో దూసుకుపోతున్నాయి. ఇకపై 1000 కోట్ల క్లబ్‌లో చేరే సినిమాల సంఖ్య పెరుగుతుండడం చూస్తుంటే, టాలీవుడ్ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయిలో ఎదుగుతున్నట్లు స్పష్టమవుతోంది. పుష్ప 2 సాధించిన రికార్డు ఇతర దర్శకులకు, నటులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న ఈ సినిమా ద్వారా తమ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ రికార్డ్ అందుకున్నారు. మొత్తానికి, పుష్ప 2 తన శక్తిని ప్రపంచానికి చాటింది. 1000 కోట్ల క్లబ్‌ను అత్యంత వేగంగా చేరిన ఈ చిత్రం, ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచింది. మరి టోటల్ గా ఈ నెంబర్ ఇంకా ఎంతవరకు వెళుతుందో చూడాలి.