మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందీ రాష్ట్రాల్లో కూడా రోజుకి 15 నుంచి 20 కోట్లు రాబడతూనే ఉన్నారు. డిసెంబర్ 5 న పుష్ప 2 వచ్చే వరకు ఇప్పుడప్పట్లో కనీస స్థాయి పోటీ ఇచ్చే మూవీనే కనుచూపు మేరలో లేదు. కంగువా కోలీవుడ్ లో తప్ప ఇంకో మార్కెట్ లో దుమ్ముదులుపుతుందనలేం. ఈ సంగతి అటుంచితే, ఇప్పుడు ఎన్టీఆర్ మీద ఓ స్పెషల్ డిస్కర్షన్ మొదలైంది. తను సపోర్టింగ్ హీరోగా వస్తే, త్రిబుల్ ఆర్ కి 1350 కోట్ల వసూళ్లొచ్చాయి. దేవరగా మారి సోలోగా పాన్ ఇండియా మీద దాడి చేస్తే ఇప్పటి వరకు 650 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి… మొత్తం కలిపితే 2 వేల కోట్ల స్టార్ అనిపించుకున్నాడు. ఇక్కడ రెండు పాన్ ఇండియా మూవీల్లో హీరోయిజం చూపిస్తేనే ఈ రేంజ్ లో వసూళ్ల వరదొచ్చింది.. అలాంటి తను బాలీవుడ్ కి ఫస్ట్ టైం తనలోని విలనిజాన్ని చూపిస్తే, సినీసునామేనా? బేసిగ్గా ఎన్టీఆర్ హీరోగా మార్కెట్ ని ఎంతబాగా షేక్ చేసినా, విలన్ గా మారితేనే సెన్సేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. దానికి కారణం ఈ రాముడిలోని నట రావణుడి రేంజ్ ఏంటో, జైలవకుశలో జనం చూశారు.. టెంపర్ తో టేస్ట్ చేశారు… బేసిగ్గా ఓ హీరోలో అసలైన నటుడు బయటికొచ్చి బీభత్సం చేయాలంటే, విలన్ గానే మారాలి… అదే ఎన్టీఆర్ కెరీర్ లోతెలుగులో రెండు సార్లు, హిందీలో మొదటి సారి జరగబోతోంది. వార్ 2 లో తన ఎంట్రీనే మతిపోయేలా 150 కోట్ల ఖర్చుతో ప్లాన్ చేశారంటే, ఇదేదో బాలీవుడ్ హిస్టరీలోనే రికార్డుల రీసౌండ్ కన్ఫామ్ అయ్యేలా ఉంది…
గెడ్డం మీసం రాకముందే ఆది లాంటి హై ఓల్టేజ్ మాస్ మూవీలతో, సౌత్ లోనే భారీ మాస్ ఫాలోయింగ్ పెంచుకున్న కుర్రాడిగా ఎన్టీఆర్ జూనియర్ కి ఓ హిస్టరీ ఉంది. నార్త్ ఇండియాలో ప్రభాస్, బన్నీ తర్వాతే పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసినా, చాలా వేగంగా, నార్త్ లోని మాస్ లో భయంకర మైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్న రికార్డు కూడా తనకే దక్కింది
అలాంటి ఈహీరో సడన్ గా విలన్ గా మారితేనే అంతా షాక్ అయ్యారు. వార్ 2 లో హ్రితిక్ హీరో అయితే, ఎన్టీఆర్ విలన్ అనగానే, ఇదేం నిర్ణయం అన్నారు.
త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ పడ్డాక, దేవరతో పాన్ ఇండియాని ఎన్టీఆర్ షేక్ చేశాక, ఎందుకు ఇలా ఓ హిందీ మూవీలో విలన్ గా మారాడు తారక్ అన్నారు. కాని టాలీవుడ్ లో బన్నీ దేశముదురైతే, ఎన్టీఆర్ విశ్వముదురు… భయంకరమైన కామన్ సెన్స్ తో, ఏటికి ఎదురీతే టైప్ నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు.
అలాంటి తను న్యాచురల్ ఆర్టిస్టే కాదు, న్యాచురల్ మాస్ స్టార్ కూడా… ఇండస్ట్రీలో మంచి నటుడిగా, మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా ఇలా, రెండు ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్, చిరంజీవి లానే, ఎన్టీఆర్ జూనియర్ లో కూడా ఆ రేర్ క్వాలిటీ ఉంది.
ఇప్పుడే ఈ డిస్కర్షన్ పెరగటానికి రీజన్, వార్ 2 లో ఎన్టీఆర్ విలనిజం మీద సడన్ గా భారీ డిస్కర్షన్ తో హైప్ రావటం.. ఆల్రెడీ వార్ 2 మూవీ మరో 40రోజుల షూటింగ్ చేస్తే, పేకప్ చెప్పేయటమే..కాని ఈ సినిమా మొదలైన ఇన్నాళ్లకు ఎన్టీఆర్ విలనిజం మీద బాలీవుడ్ మీడియా డిస్కర్షన్స్ వైరలవ్వటానికి రీజనుంది
అదే జైలవకుశ, టెంపర్ మూవీలు… ఇందులో నవరసాలని తన నటనతో నలిపేసిన తారక్, పూర్తి స్థాయి విలనిజం అంటే ఏంటో రుచి చూపించాడు. మాడ్రన్ రావణుడిగా, కరెప్టెడ్ పోలీస్ గా కనిపిస్తే చంపేయాలనేంతగా నెగెటీవ్ రోల్స్ లో షాక్ ఇచ్చాడు. ఎలాంటి నటుడైనా, తనలోని అసలైన నటనను బయటికి తీయాలంటే నెగెటీవ్ రోల్స్ తోనే సాధ్యం.. అక్కడే పాత్రలో తనని డైరెక్టర్ వాడుకుంటే, పాత్రతో తను ఆడుకున్నాడు
అందుకే వార్ 2 లో ఎన్టీఆర్ విలన్ అనగానే, అక్కడ స్క్రీన్ లో గ్రీక్ గాడ్ హ్రితిక్ ఉన్నా, స్పెషల్ రోల్ లో షారుఖ్ కనిపించబోతున్నా, సీన్ లో విలన్ తారకే కాబట్టి, తెరమొత్తం తానే కనిపించే ఛాన్స్ ఉంది. తనకి పాత్ర కూడా అలాంటిది దక్కడమే కారణమంటున్నారు. 150 కోట్ల ఎంట్రీ సీన్ ఓ విలన్ కి పెట్టారంటే, వార్ 2 లో తన పాత్ర ఏరేంజ్ లో ఉండబోతోందో ఊహించుకోవచ్చు… వార్ 2 షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎన్టీఆర్ మీద తప్ప హ్రితిక్, షారుఖ్ మీద వార్తలే లేవు.. అదేదో ఇదో తెలుగు సినిమా అయినట్టు, ఈ మూవీకి ఎన్టీఆరే హీరో అయినట్టు బాలీవుడ్ మీడియాలో తారక్ మీదే వార్తలొస్తున్నాయి. ఇవన్నీ చూస్తే ఎవరి మూవీలో ఎవరు నటిస్తున్నారనే డౌట్లొచ్చేలా తారక్ మార్కెట్ మైలేజ్ ఇమేజ్ లానే పెరిగిపోయిందనే సమాధానమే వస్తోంది.