దేవర సినిమాపై మెగా ఫ్యాన్స్ పెట్టిన గురి దెబ్బకు ఇతర హీరోలు కూడా భయపడ్డారు. కొరటాల శివ మీదున్న కోపమే ఆ రేంజ్ లో చూపిస్తే… పొరపాటున మెగా ఫ్యామిలీతో గోక్కుంటే ఏ రేంజ్ లో నెగటివ్ ప్రచారం ఉంటుందో అనే భయం వేరే హీరోల్లో కూడా మొదలయింది. అందుకే పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు. సినిమా విషయంలో ఎక్కడా కూడా దొరకవద్దు అనుకున్నాడో ఏమో ఆలస్యం అయినా పర్వాలేదు సినిమా పక్కాగా ఉండాలి అనే మాట సుకుమార్ తో చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే పరిస్థితి అర్ధం చేసుకున్న నిర్మాతలు కూడా ఈ విషయంలో సైలెంట్ గానే ఉండి వేరే సినిమాల మీద ఫోకస్ పెట్టుకున్నారు. అయితే తనను టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ పై సైలెంట్ గా రివెంజ్ తీర్చుకున్నాడు దేవర. ఎస్ లెక్కలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దేవర డే 1 షేర్ తో.. భీమ్లా నాయక్ రికార్డ్ ను కనుమరుగు చేసాడు. పవన్ కళ్యాణ్ కు ఆ సినిమాతో 97 కోట్లు రాగా మొదటి రోజు… అదే దేవరకు… డే 98 కోట్లు వచ్చాయి. దేవర 2 షేర్ విషయానికి వస్తే… రంగస్థలం ను బీట్ చేసాడు.
రంగస్థలం డే 2 షేర్… 125 కోట్లు కాగా దేవర డే 2 షేర్… 127.7 కోట్లుగా ఉంది. ఇక దేవర మూడు రోజుల షేర్ 160 కోట్లు కాగా వాల్తేరు వీరయ్య షేర్ 136 కోట్లు మాత్రమే. ఇక దేవర 7 రోజుల షేర్ చూస్తే 200 కోట్లు కాగా చిరంజీవి సైరా సినిమా షేర్ కేవలం 140 కోట్లు మాత్రమే. అంటే 60 కోట్లు పైగా తేడా ఉంది. ఇలా దేవర సినిమా ఒక్కో లెక్కను సరి చేసుకుంటూ వెళ్లి సైలెంట్ గా వైలెంట్ రివెంజ్ తీర్చుకున్నాడు. దేవర సినిమా తర్వాత వచ్చే గేమ్ చేంజర్ ఇప్పుడు దేవర రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.