Telugu stars : తెలుగు టాప్ స్టార్స్‌

2014 నుంచి 2024 ఏప్రిల్ వరకు.. గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్‌లో ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్స్ జాబితా రిలీజ్ అయింది.

 

 

2014 నుంచి 2024 ఏప్రిల్ వరకు.. గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్‌లో ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్స్ జాబితా రిలీజ్ అయింది. ఈ లిస్టును ఐఎండీబీ (IMDb) సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ లిస్టులో ఉండటం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది దీపిక. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన కల్కి సినిమా జూన్ 27న రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఇక ఐఎండీబీ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ టాప్ 100 లిస్టులో బాలీవుడ్‌ (Bollywood) తో పాటు తెలుగు (Tollywood), తమిళ, మలయాళ, కన్నడ స్టార్స్ కూడా ఉన్నారు. అయితే.. ఈ జాబితా టాప్ 10లో అందరూ బాలీవుడ్ స్టార్లే ఉన్నారు. దీపిక తర్వాత షారుక్ ఖాన్(Shahrukh Khan), ఐశ్వర్య రాయ్(Aishwarya Rai), ఆలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ ఉన్నారు టాప్ 10లో ఉన్నారు.

అయితే.. పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) మాత్రం 29వ స్థానం దక్కించుకొని టాప్ 30లో నిలిచాడు. తెలుగు హీరోలను తీసుకుంటే ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలవగా.. ఆ తర్వాత 31 ప్లేస్‌లో నిలిచి టాప్ 40లో చోటు దక్కించుకున్నాడు రామ్ చరణ్. ఇక టాప్ 50లో అల్లు అర్జున్ నిలిచాడు. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌తో 47వ స్థానంలో నిలిచాడు బన్నీ. అలాగే.. ఎన్టీఆర్ 67, మహేష్ బాబు 72వ స్థానంలో నిలిచారు. మొత్తంగా.. తెలుగు నుంచి గత దశాబ్ద కాలంలో మోస్ట్ వ్యూడ్ స్టార్స్‌గా ఐఎండీబీ టాప్ 100లో చోటు దక్కించుకున్న హీరోలుగా.. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మరియు మహేష్‌ బాబు నిలిచారు. అయితే.. వీరిలో మహేష్ బాబు ఇంకా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వకపోవడం విశేషం.