టాలీవుడ్ కు వరస్ట్ ఇయర్ 2024, దీనెమ్మ ఇదేం టార్చర్ ఇయర్ రా…

2024... విషయంలో కల్కీ... దేవర, పుష్ప 2 తో టాలీవుడ్ ఒకపక్క సంతోషంగా ఫీల్ అయినా మరో పక్కన కన్నీళ్లు పెట్టుకుని తలబాదుకునే పరిస్థితి. గతంలో తెలుగు సినిమాలు హిట్ అయినా హిట్ కాకపోయినా టాలీవుడ్ 2024లో బాధపడినంత రేంజ్ లో కరోనా టైం లో కూడా బాధపడలేదు అనే మాట అక్షరాల నిజం.

  • Written By:
  • Publish Date - December 21, 2024 / 11:59 AM IST

2024… విషయంలో కల్కీ… దేవర, పుష్ప 2 తో టాలీవుడ్ ఒకపక్క సంతోషంగా ఫీల్ అయినా మరో పక్కన కన్నీళ్లు పెట్టుకుని తలబాదుకునే పరిస్థితి. గతంలో తెలుగు సినిమాలు హిట్ అయినా హిట్ కాకపోయినా టాలీవుడ్ 2024లో బాధపడినంత రేంజ్ లో కరోనా టైం లో కూడా బాధపడలేదు అనే మాట అక్షరాల నిజం. ఎప్పుడు ఏ వివాదం బయటికి వస్తుందో అని తెలుగు సినిమా పెద్దలు కూడా భయపడిపోతున్నారు. చిన్నచిన్న నటుల నుంచి పెద్ద నటుల వరకు ఈ ఏడాది ఒకరకంగా ఏదో తెలియని భయం లో గడిపిన పరిస్థితి.

అవును జానీ మాస్టర్ అరెస్టు వ్యవహారం తెలుగు సినిమాను ఒక రకంగా ఊపేసింది. తెలుగు సినిమా పరువును తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసింది ఈ వ్యవహారం. అందులో వాస్తవాలు ఏంటి అనేది తెలియకుండానే చాలామంది జానీ మాస్టర్ ను దోషిగా భావించారు. అయితే క్రమంగా జానీ మాస్టర్ కు సానుభూతి కూడా పెరగడం మొదలైంది. ఏకంగా నేషనల్ అవార్డు కూడా జానీ మాస్టర్ కు రద్దు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు సినిమాతో పాటుగా జాతీయస్థాయిలో ఒకరకంగా ఊపేసింది.

రాజకీయ వర్గాలను కూడా ఈ అరెస్టు వ్యవహారం ఒకరకంగా వణికించింది అనే చెప్పాలి. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోను పోలీసులు ఇంటికి వెళ్లి అరెస్టు చేయడంతో ఒక్కసారిగా కంగుతున్నారు. దీనితో ప్రభుత్వాలు సినిమా వాళ్లకు గులాం గిరి చేయవు అనే విషయం చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఇక మోహన్ బాబు ఇంట్లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ వ్యవహారంతో తెలుగు సినిమా పరిశ్రమ పరువు ఇతర భాషల్లో కూడా పోయిందని చెప్పాలి. ఏకంగా మోహన్ బాబు మీడియా వాళ్ళను కొట్టడంపై చాలామంది షాక్ అయ్యారు.

తెలుగు సినిమా పరిశ్రమలో అన్నేళ్ళు అనుభవం ఉన్న వ్యక్తి ఆ విధంగా దాడి చేస్తారని ఎవరు ఊహించలేదు. ఇక తాజాగా యూట్యూబర్ ప్రసాద్ బెహరా వ్యవహారం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా జనాలు కూడా షాక్ అయారు. ఫేమొచ్చిన తర్వాత ఈ విధంగా వ్యవహరించడం ఎందుకని అందమైన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక సంధ్య థియేటర్ వ్యవహారం అయితే తెలుగు సినిమాకు బెనిఫిట్ షో అడిగే ఛాన్స్ లేకుండా చేసింది. ఒక మహిళ ప్రాణం పోవడంతో తెలుగు సినిమాపై తీవ్రస్థాయి విమర్శలు వస్తున్నాయి. ఇక టికెట్ ధరల వ్యవహారం కూడా తెలుగు సినిమాను మరింత ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. ఏకంగా పుష్ప సినిమా పార్ట్ 2 విషయంలో 1300 రూపాయలు టికెట్ కు వసూలు చేయడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇలా 2024 తెలుగు సినిమాకు అత్యంత వరస్ట్ ఇయర్ గా చెప్పాలి.