ఎన్టీఆర్ ను కూడా వదలని 2024, వరస్ట్ ఇయర్

ఏ మాటక మాట 2024 సినిమా పరిశ్రమకు అత్యంత వరస్ట్ ఇయర్ గా చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా పరిశ్రమలో ఏదో తెలియని అలజడి నెలకొంది. మోహన్ బాబు ఇంట్లో జరిగిన వ్యవహారం ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలుగు సినిమా పరిశ్రమను ఒక రకంగా ఊపేశాయి.

  • Written By:
  • Publish Date - December 24, 2024 / 06:29 PM IST

ఏ మాటక మాట 2024 సినిమా పరిశ్రమకు అత్యంత వరస్ట్ ఇయర్ గా చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా పరిశ్రమలో ఏదో తెలియని అలజడి నెలకొంది. మోహన్ బాబు ఇంట్లో జరిగిన వ్యవహారం ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలుగు సినిమా పరిశ్రమను ఒక రకంగా ఊపేశాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత నుంచి పరిణామాలు చాలా తీవ్రంగా ఉండటం రాష్ట్రంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉండటం చూసి చాలామంది 2024 అసలు ఏ మాత్రం బాగా లేదంటూ… సినిమా పరిశ్రమ ఈ నాలుగు రోజులు సైలెంట్ గా ఉంటే మంచిది అంటూ సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు.

ఈ రెండు కూడా ప్రముఖ కుటుంబాల్లో జరగడంతో సామాన్య ప్రజలు కూడా ఈ వ్యవహారాలపై కాస్త ఆసక్తి ప్రదర్శించారు. చిన్నచిన్న విషయాల్లో కూడా తొంగి చూసి మీడియా ఛానల్స్ ఈ వ్యవహారాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. మొన్నా మధ్య రాజ్ తరుణ్ అనే నటుడి వ్యవహారం కూడా సినిమా పరిశ్రమంలో అత్యంత వివాదంగా మారింది. అలాగే బిగ్ బాస్ వ్యవహారం కూడా ఈ ఏడాదికాస్త సంచలమైంది. ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ను కూడా 2024 వదిలిపెట్టలేదు. దేవరా సినిమా సమయంలో తన అభిమానికి సహాయం చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రకటన చేశాడు.

ఆ సమయంలో అతని అభిమానికి అయ్యే వైద్య ఖర్చులు భరిస్తానంటూ కూడా ఒక హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా అసలు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి సహాయం అందలేదని ఆసుపత్రి ఇంకా 20 లక్షలు రూపాయలు చెల్లించాలని అడుగుతోందని బాధితుడి తల్లి మీడియా ముందుకు వచ్చారు. దీనితో ఈ వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ ది తప్పు అంటూ జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలా 2024 జూనియర్ ఎన్టీఆర్ ని కూడా వదిలి పెట్టలేదు అనికొందరు సెటైర్లు వేస్తున్నారు.

దేవరా సినిమా సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ బాగానే ఇబ్బందులు పడ్డాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయినా ట్రోలింగ్ మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది. సినిమా కలెక్షన్లపై కూడా ప్రభావం కొంత పడిందనే చెప్పాలి. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్… కొరటాల శివ పై ఉన్న కోపంతో ఆ సినిమాను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు. దీనితో జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ఒక్కడే కష్టపడాల్సి వచ్చింది. టాలీవుడ్ లో కూడా పెద్దగా ఎవరూ సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు. నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ కరువైంది. తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కు సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఇలా 2024 ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ కు కూడా వరస్ట్ ఇయర్ గానే చెప్తున్నారు టాలీవుడ్ జనాలు.