టాలీవుడ్ కి ఆ రెండు కుటుంబాలు పెద్ద దిక్కు లాంటివి… సినిమా జనాలకే కాదు, తెలుగు ప్రజలు అందరికి ఆదర్శంగా ఎన్నో సందర్భాల్లో నిలిచిన కుటుంబాలు అవి… కాని పెళ్లి అనే ఒక్క మాట ఆ రెండు కుటుంబాల్లో ఒక చేదు జ్ఞాపకం, ముఖ్యంగా వారసులు వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఆ రెండు కుటుంబాలే మెగా, అక్కినేని. ఈ రెండు కుటుంబాల్లో పెళ్లి అంటే ఫ్యాన్స్ కూడా భయపడుతున్నారు. అక్కినేని కుటుంబంలో ఎక్కువగా మగాళ్ళకు విడాకులు అయితే మెగా ఫ్యామిలీలో ఆడాళ్ళకు ఎక్కువగా విడాకులు అయ్యాయి.
మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే… సాయి ధరం తేజ్ తల్లి, చిరంజీవి సోదరి… విజయ దుర్గ 15 ఏళ్ళ క్రితం తన భర్తతో విడిపోయారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో సాయి ధరం తేజ్ బయటపెట్టాడు. ఆ తర్వాత ఆమె సింగిల్ గానే ఉండి పిల్లల బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ రెండు వివాహాలు చేసుకోగా రెండు ఫెయిల్ అయ్యాయి. మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ తో ఆమె విడిపోయి ఆ తర్వాత కళ్యాణ్ అనే వ్యక్తి వివాహం చేసుకుని అతనికి కూడా దూరం అయ్యారు. ఇప్పుడు సింగిల్ గానే ఉంటున్నారు.
ఆ తర్వాత నాగబాబు కుమార్తె నిహారిక… చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని విడిపోయారు. ఆమె ఇప్పుడు సింగిల్ గానే ఉంటూ సినిమాల మీద ఫోకస్ పెట్టారు. ఈ ఫ్యామిలీ మగాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కరే విడాకుల వ్యవహారంలో ఉన్నారు. ఆయన ముందు రెండు వివాహాలు చేసుకోగా ఇద్దరికీ విడాకులు ఇచ్చి ఇప్పుడు మూడో వైవాహిక జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ కూడా రెండు వివాహాలు చేసుకున్నారు.
అక్కినేని నాగార్జున మొదటి వివాహం లక్ష్మిని చేసుకోగా ఇద్దరూ కొన్నాళ్ళకు విడిపోయారు. తర్వాత అమలను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఆయన కుమారుడు నాగ చైతన్య మొదటి వివాహం సమంతాను చేసుకోగా 2021 లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. చైతన్య ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. అఖిల్ విషయానికి వస్తే శ్రేయా భూపాల్ ను వివాహం చేసుకోవాలనుకుని నిశ్చితార్ధం చేసుకోగా ఇద్దరూ పెళ్ళికి నాలుగు రోజుల ముందు విడిపోయారు. యార్లగడ్డ సుమంత్… నాగార్జున మేనల్లుడు అయిన సుమంత్ కూడా ముందు కీర్తి రెడ్డిని వివాహం చేసుకుని ఇప్పుడు సింగిల్ గా ఉంటున్నారు. ఈ ఫ్యామిలీలో… ఆయన సోదరి సుప్రియ మాత్రమే విడాకుల వ్యవహారంలో ఉన్నారు. ఆమె కూడా వివాహం చేసుకుని విడిపోయారు. ఇప్పుడు సింగిల్ గానే ఉంటున్నారు. ఇలా ఈ రెండు ఫ్యామిలీలకు పెళ్లి అనేది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది అనే చెప్పాలి.