మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంత పెరిగిందో తెలుసా…. ఒకే ఒక్క సినిమాతో ఖాన్లు, కపూర్ల నే కాదు, సూపర్ స్టార్ రజినీకాంత్ ని దాటేశాడు.. చైనీస్ కూంగ్ ఫూ స్టార్ జాకీ ఛాన్ ని మించిపోయాడు. ఏకంగా హాలీవుడ్ స్టార్ల లిస్ట్ లో చేరేంత వరకు నిచ్చెనెక్కాడు. రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత త్రిబుల్ సెంచరీ కొట్టిన స్టార్ గా మారాడు. ఏకంగా 300 కోట్లకి తన పారితోషికం పెరిగిపోయింది. త్రిబుల్ ఆర్ కి కూడా 100 కోట్లు తీసుకున్నాడన్నారు కాని, నిజానికి 70 కోట్లే తను ఆ మూవీకి పారితోషికంగా అందుకున్నాడు. కాని దేవరకి 140 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న తారక్, దేవర సునామీ తర్వాత లెక్కా మార్చేశాడు. డిమాండ్ మీద ఆరేంజ్ కమాండ్ పెరిగిపోయింది. రెబల్ స్టార్ రేంజ్ ని అందుకోవటం అంత ఈజీకాదు. ఏకంగా ఐదు పాన్ ఇండియా హిట్ల తర్వాతే 300 కోట్ల పారితోషికాన్ని అందుకున్నాడు ప్రభాస్.. అలాంటిది ఇప్పుడా పాన్ ఇండియా కింగ్ పక్కనే 300 కోట్ల చైర్ చేసుకోగలుగుతున్నాడు ఎన్టీఆర్.. అదెలానో చూసేయండి.
త్రిబుల్ ఆర్ కిముందు వరకు ఎన్టీఆర్ సినిమా వసూల్లు 200 కోట్ల లోపే. అదే త్రిబుల్ ఆర్ తర్వాత 1200 కోట్ల క్లబ్ లోచేరాడు తారక్. కాకపోతే 200 కోట్ల మార్కెట్ ఉన్న టైంలో 20 నుంచి 30 కోట్లు లేదంటే 55 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. త్రిబుల్ ఆర్ కి 70 కోట్ల వరు పారితోషికం అందుకున్నాడు. కాని దేవరకి ఏకంగా 140 కోట్లు తీసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఖాన్లు కపూర్లను, దాటి, రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ కి చేరాడన్నారు.
విచిత్రం ఏంటంటే అప్పటికే ప్రభాస్ 150 కోట్లనుంచి 200 కోట్లు, ఆతర్వాత ఫౌజీకి 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కి వెళ్లాడు. అప్పడే తమిళ దళపతి విజయ్ 200 కోట్లను రీచ్ అయితే, రజినీకాంత్ 220 కోట్లు తీసుకుంటున్నాడనే గుసగుసలొచ్చాయి.
కట్ చేస్తే ఇండియాలో ఖాన్లెవరైనా 130 కోట్ల కు మించి రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పరిస్థితిని చేరుకోలేదు. అలాంటి టైంలో ప్రభాస్ 300 కోట్లు తీసుకుంటున్నాడు. ఆతర్వాత ఎవరు ఆరేంజ్ ని అందుకుంటారనుకుంటుంటే, సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చాడు.
30 నుంచి 60 అక్కడి నుంచి 70 కోట్ల కు చేరిన తన రెమ్యునరేషన్ దేవర బ్లాక్ బస్టర్ తో ఏకంగా 300 కోట్లకు చేరేలా ఉంది. ఇది నిజం ఎందుకంటే దేవర 6 రోజుల్లో 400 కోట్లు 7రోజుల్లో 480 కోట్లు రాబట్టిందంటే కేవలం అంటే కేవలం ఎన్టీఆరే కారణం… అందుకే దేవర 2 కి తనకు 300 కోట్ల ఆఫర్ చేశారు… తన అన్నే నిర్మాత అయినా, నార్త్ లో కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి, ఈ పారితోషిక భారం తన పైకూడ వేసుకుంటున్నాడట
ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్, ఇమేజ్ వల్ల తనకా మార్కెట్ దక్కింది. దేవరకి 140 కోట్లు తీసుకున్న ఎన్టీఆర్, దేవర 2 కి 300 కోట్లు అందుకునేలాఉన్నాడు. ఈ రేంజ్ కి ఎదగాలంటే ప్రభాస్ కి బాహుబలి 2 తర్వాత, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సినిమాలు చేయాల్సి వచ్చింది. సలార్, కల్కీ లాంటి బ్లాక్ బస్టర్లు రావాల్సి వచ్చింది. ఆతర్వాతే ప్రభాస్ రేంజ్ 300 కోట్లకు చేరింది. కాని త్రిబుల్ ఆర్ కి 70 కోట్లు, దేవరకి 140 కోట్లు ఇప్పుడు దేవర 2కి 300 కోట్లు.. అంటే సినిమా సినిమాకు తన పారితోషికం డబుల్ అవుతోంది. మధ్యలో వార్ 2 హిందీ మూవీ, ప్రశాంత్ నీల్ డ్రాగన్ కూడా ఉన్నాయి.. వాటితో వచ్చే క్రేజ్ దేవర 2 కి మరింత ప్లస్ అవుతుంది కాబట్టే, అంత ధైర్యంగా 300 కోట్లని ఎన్టీఆర్ కి సమర్పించుకుంటున్నారట.