రెబల్ స్టార్ ప్రభాస్ ఎగ్జాక్ట్ గా 12 ఏళ్ల క్రితం ఊహించని రిస్క్ తీసుకున్నాడు. కనీసం 2 ఏళ్లు మరే మూవీ చేయకుండా బాహుబలికే కేటాయించి సాహసం చేశాడు. కట్ చేస్తే 9 ఏళ్ల క్రితం బాహుబలి వచ్చింది బాలీవుడ్ ని కూడా ఉతికి ఆరేసింది. తర్వాత మరోరెండేళ్లు బాహుబలి 2 కోసం టైం స్పెండ్ చేశాడు. కష్టపడ్డాడు… ఫలితంగా 1850 కోట్ల రికార్డుతో పాన్ఇండియా కింగ్ అయ్యాడు. అచ్చంగా అలానే రెండు ప్లస్ మూడేల్లు కర్చు చేసి రెండు పాన్ ఇండియా సినిమాలతో రెండో పాన్ ఇండియా కింగ్ గా మారాడు మ్యాన్ ఆఫ్మాసెస్… తనకి 1200 కోట్లు ప్లస్ 1000 కోట్లు మొత్తంగా రెండు వేల కోట్ల రేంజ్ వచ్చేసింది. ఇందులో ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దర్ని నాలుగు ప్లస్ మూడేళ్లు తన సినిమా సెట్ లోనే అరెస్ట్ చేశాడు రాజమౌళి. అందుకు తగ్గ ఫలితం దక్కింది. ఆ ధైర్యంతోనే ఇప్పడు సూపర్ స్టార్ మహేశ్ బాబు
ని ఐదేళ్లు ఒకే మూవీ కోసం ఎంగేజ్ చేయబోతున్నాడా? మహేశ్ బాబు కూడా ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లా రిస్క్ కి రెడీ అయ్యాడా? ఈ ఐదేళ్ల స్కెచ్ వెనకున్న లాజిక్ ఏంటి?
రాజమౌళితో సినిమా అంటే హీరోలు ఏళ్లకేళ్లు సెట్స్ కే పరిమితం కావాలి. కాని దాని వల్ల రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ అయ్యాడు. ఎన్టీఆర్ గ్లోబల్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ అయ్యాడు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఈ ఇమేజ్, పాన్ ఇండియా మార్కెట్ అంత ఈజీగా రాదు.. అలాని రాజమౌళి తో సినిమా అంటే కూడా అంత ఈజీ కాదు. రెండు లేదంటే మూడు కాదంటే నాలుగైదు ఏళ్ల తనకి సమర్పించుకోవాలి. అంటే కనీసం మూడు నుంచి ఐదు సినిమాలు చేయాల్సిన టైంలో రాజమౌళి ఒకటి లేదంటే రెండు సినిమాలే తీస్తాడు..
అలా ఫ్యాన్స్ కి రెబల్ స్టార్ 4 ఏళ్లు అందుబాటులో లేకుండాపోయాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అయితే త్రిబుల్ ఆర్ పుణ్యమాని 3 ఏళ్లు ఒకే మూవీకోసం కష్టపడాల్సి వచ్చింది. అందుకు తగ్గ పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ అయ్యింది. కాని ఒక హీరో కెరీర్ల లో మూడేళ్ల ఒకే సినిమాకంటే, చాలా వరకు రిస్క్ చేసినట్టే. ఏదో రాజమౌళి సినిమాకు తిరుగుండదు కాబట్టి, ఆ ధైర్యంతో తన మూవీ అనగానే ఏళ్ళకేళ్లు సెట్స్ కే పరిమితమయ్యారు ఎన్టీఆర్, చరన్, ప్రభాస్..
ఇప్పుడు అచ్చంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకి అలాంటి పరిస్థితే వచ్చినట్టుంది. ఏకంగా ఐదేళ్లు తను రాజమౌళికే సమర్పించాలంటే, ఒక ఎనాలసిస్ మాత్రం తన నిర్ణయం సరైందని ప్రూవ్ చేస్తోంది.. దాని ప్రకారం రెబల్ స్టార్ 2013 నుంచి 2015 వరి వరకు కష్టపడినందుకు బాహుబలి రూపంలో 550 కోట్ల హిట్ పడింది. సౌత్ నార్త్ బ్యారియర్స్ ని బ్రేక్ చేసిన రికార్డు తన సినిమాకు దక్కింది.
తర్వాత రెండేళ్లు కష్టపడితే బాహుబలి 2 వచ్చింది, 1000 కోట్లు దాటిన మొదటి పాన్ ఇండియా మూవీగా చరిత్ర స్రుష్టించింది. దంగల్ చైనా వసూళ్ల వల్ల 2000 కోట్ల క్లబ్ లో చేరింది కాని, లేదంటే పాన్ ఇండియా లెవల్లో 1850 కోట్లు రాబట్టిన బాహుబలి 2 నే ఇండియా నెంబర్ వన్ మూవీగా కొనసాగేది..సో ప్రభాస్ నాలుగేళ్ల కష్టానికి బాహుబలి, బాహుబలి 2 రూపంలో చరిత్ర క్రియేట్ అయ్యింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ 3 ఏళ్ల కష్టం వల్ల 1200 కోట్ల క్లబ్ లో అడుగపెట్టే ఛాన్స్ వచ్చింది. ఆ క్రేజ్ తారక్ కి కంటిన్యూ అయ్యి, దేవరని కూడా థౌజెండ్ వాలాగా మారుస్తోంది.
ఇంత హిస్టరీ ఉంది కాబట్టే రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ అనగానే, ఇది తనకి గ్లోబల్ గా నెక్ట్స్ లెవల్ ప్రమోషన్ అన్నారు. కాకపోతే ఫ్యాన్స్ కి లోలోపల ఎక్కడో కంగారుంది.. ప్రబాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లానే తమ అభిమాన హీరోని రెండు మూడేళ్లు ఒకేసినమాకు పరిమితం చేస్తాడా? అన్నది ఫ్యాన్స్ డౌట్.
అది కొంతవరకు నిజం, మిగతా నిజం ఏంటంటే రెండు మూడేళ్లు కాదు, ఏకంగా ఐదేళ్లు మహేశ్ బాబుని తన సినిమాకోసం లాక్ చేస్తున్నాడు రాజమౌళి… అవును, మహేశ్ బాబుతో తను ప్లాన్ చేసిన సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేశాడట. అందుకే మూడేళ్లలో మొదటి పార్ట్,తర్వాత రెండేళ్లలో మరో పార్ట్ రిలీజ్ అయ్యేలా ఫ్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగానే, మహేశ్ బర్త్ డే కి కాని, దసరా కి కాని ఇలా ఏ పండక్కి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇంకా ఈ రెండు భాగాలా ప్రాజెక్ట్ మీద నిర్ణయం తీసుకోవటం అనే విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయట.