10 రోజులు 680 కోట్లు… ఓన్లీ నెట్ వసూళ్లే 466 కోట్లు..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా వెయ్యికోట్ల వసూళ్లని తేలక చేశాడు. అసలు నెగెటీవ్ టాక్ కాదు, డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న దేవర, టాక్ కి భిన్నంగా 680 కోట్లు రాబట్టిందంటే తన మీద ఎంత వ్యతిరేక ప్రచారం జరుగుతుంతో తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - October 8, 2024 / 12:39 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా వెయ్యికోట్ల వసూళ్లని తేలక చేశాడు. అసలు నెగెటీవ్ టాక్ కాదు, డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న దేవర, టాక్ కి భిన్నంగా 680 కోట్లు రాబట్టిందంటే తన మీద ఎంత వ్యతిరేక ప్రచారం జరుగుతుంతో తెలుస్తోంది. కాని కలిసొచ్చినప్పుడు కోట్లు రాబట్టడం కాదు, కామెంట్లు, ట్రోలింగ్స్ పెరిగిన టైంలో కలెక్షన్ల సునామీ తెస్తేనే, హీరో ఇమేజ్, మార్కెట్ బయట పడుతుంది. అదే దేవర విషయంలో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా దేవర నెట్ కలెక్సన్స్ 466 కోట్లని తేలింది. గ్రాస్ కలెక్షన్స్ మాత్రం 680 కోట్లగా కన్ఫామ్ అయ్యింది. అంటేనిర్మాతలకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన 680 కోట్లలో ఈపాటికే 466 కోట్లు చేతికందనిట్టు తెలుస్తోంది. కేవలం 10 రోజుల్లో 680 గ్రాస్ కలెక్షన్స్ అంటే, టోటల్ టాలీవుడ్ ఫిదా అవుతోంది. బాలీవుడ్ ఎలాగూ తెలుగు పాన్ ఇండియా మూవీ అంటేనే, వనుకుతుంది. దీనికి తోడు ఎన్టీఆర్ కి నార్త్ లో కూడా మాస్ ఇమేజ్ ఎంతుందో తేలిపోయింది. ఇక వెయ్యికోట్ల పండక్కి ఫ్యాన్స్ రోజులు లెక్కపెడుతున్నారు. మోస్ట్ ఫ్రైడే ఈ సినిమా థౌజెండ్ వాలాగా మారగానే, అదేరోజు సక్సెస్ ఈవెంట్ మీద స్పెషల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

దేవర మూవీ 6 రోజుల్లో 400 కోట్లు 8 రోజుల్లో 580 కోట్లు, ఇప్పుడు 10 రోజుల్లో 680 కోట్లు కలెక్ట్ చేసింది. ఐతే ప్రపంచ వ్యాప్తంగా 466 కోట్ల నెట్ వసూళ్లు నిర్మాతకి దక్కాయి. సో బేసిగ్గా వసూళ్లని గ్రాస్ కలెక్షన్స్ లోనే చూస్తారు. అలా చూస్తే వెయ్యికోట్లకు ఇంకా ఈ సినిమా 320 కోట్ల దూరంలోనే ఉంది. రోజుకి 60నుంచి 80 కోట్ల మధ్య వరల్డ్ వైడ్ గా వసూళ్లు వస్తూనే ఉన్నాయి

ఆ లెక్కన ఈ శుక్రవారం వసూళ్లతో కలిపి 1000 కోట్ల వసూళ్లు రావొచ్చనే అంచనాలున్నాయి. అంటే దసరాకి ఒకరోజు ముందు థౌజెండ్ వాలాగా దేవర దుమ్ముదులపబోతున్నాడు. అయితే కొత్త అప్ డేట్ ఏంటంటే, శుక్రవారం అంటే, సద్దుల బతుకమ్మ రోజే దేవర తాలూకు ఎనౌన్స్ మెంట్ రాబోతోంది.

దేవర మూవీ విషయంలో ప్రీరిలీజ్ఈవెంట్ జరగలేదు. సక్సెస్ ఈవెంట్ ని ఫ్యాన్స్ మధ్య జరుపుకోలేదు. రెండీంటికి తెలంగాణ ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వలేకపోయింది. ఎన్టీఆర్ కి ఉన్నక్రేజ్ కారణంగా, భారీగా జనం వస్తే కష్టమని, అసలే పండగ సీజన్ లో పోలీసులు బిజీగా ఉంటారనే ఒకే కారనంతో పర్మీషన్ రాలేదు..

కాని ఆఫ్టర్ దసరా సక్సెస్ సెలబ్రేషన్స్ కి పర్మీషన్ ఇస్తామనే మాట వచ్చిందట. సో అన్నీ లెక్కలేసుకుని, వెయ్యికోట్ల వసూళ్లు క్లబ్ లో దేవర చేరగానే, ఎనౌన్స్ మెంట్ వస్తుందట. అంటే శుక్రవారం సాయంత్రం లేదంటే శనివారం అంటే దసరా రోజే సక్సెస్ సెలబ్రేషన్స్ తాలూకు ఈవెంట్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్నారు

ఆల్రెడీ ఫిల్మ్ టీం అంతా కలిసి దేవర సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంది. ఇక ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ అండ్ టీం స్పెషల్ ఈవెంట్ మాత్రమే బాఖీ. థ్యాంక్స్ చెప్పే ఆ ఈవెంట్ ని దసరాకే ఎనౌన్స్ చేయటం ఆల్ మోస్ట్ ఫైనలైంది. ఏదేమైనా పోటీ ఇచ్చేసినిమాలు లేవు. పోటికి వస్తున్నమూవీలు వాయిదా పడటమో, లేదంటే స్వాగ్ గా కొట్టుకుపోవటమో జరుగుతోంది. సౌత్, నార్త్ అంతటా థియేటర్స్ లో సినిమా అంటే దేవర తప్ప మరోకటి కాదని తేలిపోయింది

సౌత్, నార్త్ లో సలార్, పుష్ప తర్వాత దేవరే ఫ్లాప్ టాక్ తో విడుదలై, బ్లాక్ బస్టరైన మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది. కాకపోతే ఈ మూడు సీనిమాల్లో దేవర నెంబర్ వన్ అవటానికి కారనం, సలార్ ఓవరాల్ గా 750 కోట్లు రాబడితే, పుష్ప 450 కోట్లు రాబట్టింది. దేవర కేవలం 10 రోజుల్లో 680 కోట్లు రాబట్టి, వెయ్యికోట్ల క్లబ్ లో చేరేలా ఉంది…