రష్మిక, శ్రీలీలపై కూడా కేసు నమోదు, పక్కా స్కెచ్ తో రంగంలోకి పోలీసులు

సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ కు రకాలుగా చుక్కలు చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సాక్షాలతో హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేయడానికి సిద్ధమయింది.

  • Written By:
  • Publish Date - December 23, 2024 / 09:08 PM IST

సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ కు రకాలుగా చుక్కలు చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సాక్షాలతో హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేయడానికి సిద్ధమయింది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మరింత మందిపై కూడా కేసులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ పోలీసుల సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. తాజాగా హీరోయిన్ రష్మిక మందన అలాగే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలపై కూడా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

అల్లు అర్జున్ తో పాటు వాళ్లు కూడా థియేటర్లోనే ఉన్నారు. ఆ సమయంలో వాళ్లు కూడా బయటకు రాలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ కలిసి ఒకేసారి లోపలికి వెళ్లడం… అందరూ కలిసి ఒకేసారి బయటకు రావడం… అందరూ కలిసి ఒకేసారి సినిమా కూడా చూడటం వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. దీనితో హీరోయిన్ పై కూడా కేసులు నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు తెలంగాణ పోలీసులు. రష్మిక మందన అభిమానులు కూడా అక్కడికి భారీగా వచ్చారు.

హీరోయిన్లు కూడా రావడంతో క్రౌడ్ మరింత ఎక్కువగా కనపడింది. అందుకే ఇప్పుడు హీరోయిన్లపై కూడా కేసు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా బయట పెట్టిన వీడియోలో రష్మిక మందన శ్రీలీల కూడా కనిపించారు. ఇక అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన తర్వాత రష్మిక మందన.. అల్లు అర్జున్ కు మద్దతుగా అనేక కామెంట్ చేస్తూ వచ్చింది. ఇక సినిమాల్ లో అల్లు అర్జున్ యాక్టింగ్ కు సంబంధించి కూడా పలు కామెంట్స్ చేసింది రష్మిక మందన.

ఇప్పటివరకు ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ ను మాత్రమే పోలీసులు ఇబ్బంది పెట్టారు. త్వరలోనే రష్మిక మందనాని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ తర్వాత చోటు చేసుకోబోయే పరిణామాలపై చాలానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే సీన్ లేదనేది పోలీసుల ప్రకటన తర్వాత మరింత క్లారిటీ వచ్చింది. అటు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలపై కూడా కేసు పెట్టి అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది. ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యం ఈ వ్యవహారంలో ఇరుక్కుని నానా ఇబ్బందులు పడుతోంది. శనివారం సాయంత్రం అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసిన కామెంట్స్ తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం పలువురు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి కూడా దిగారు.