కపిల్ శర్మ బలుపు… స్టార్ డైరెక్టర్ లుక్ పై వరస్ట్ క్వశ్చన్

సాధారణంగా బాలీవుడ్ నటులు సౌత్ ఇండియా పై కాస్త అభ్యంతర వ్యాఖ్యలు చేస్తారు అనేది మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా రంగు విషయంలో అలాగే వస్త్రధారణ విషయంలో కూడా నార్త్ ఇండియా నుంచి కొన్ని వరస్ట్ కామెంట్లు మనకు వినపడుతూనే ఉంటాయి

  • Written By:
  • Publish Date - December 18, 2024 / 08:44 PM IST

సాధారణంగా బాలీవుడ్ నటులు సౌత్ ఇండియా పై కాస్త అభ్యంతర వ్యాఖ్యలు చేస్తారు అనేది మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా రంగు విషయంలో అలాగే వస్త్రధారణ విషయంలో కూడా నార్త్ ఇండియా నుంచి కొన్ని వరస్ట్ కామెంట్లు మనకు వినపడుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇది కాస్త పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని కాస్త తగ్గినా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో కపిల్ శర్మ వేసిన ఓ ప్రశ్న వివాదాస్పదమవుతుంది.

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ను అతను అడిగిన ప్రశ్న… షో చూస్తున్న వాళ్లకు వరస్ట్ గా అనిపించింది. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో పాపులర్ అయిన తమిళ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొని సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే టైంలో అట్లీ లుక్ పై కపిల్ శర్మ ఒకరకంగా విమర్శలు చేస్తూ అట్లిని అవమానించే విధంగా ప్రశ్న అడిగాడు. కథ చెప్పడం కోసం ఎవరినైనా స్టార్ హీరో ను మీరు కలిసినప్పుడు వాళ్లు అట్లీ ఎక్కడా అని అడుగుతారా అని కపిల్ వెటకారం గా అడిగాడు.

అతడు ఏ ఉద్దేశంతో ఆ ప్రశ్న అడిగాడో అర్థం అయినా అట్లీ తన మార్క్ ఆన్సర్ ఇచ్చాడు. మీరు ఎందుకు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారో నాకు అర్థమైంది… మీ ప్రశ్నకు నా సమాధానం ఒక్కటే… టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది పెద్ద విషయం కాదు అంటూ స్ట్రాంగ్ గా చెప్పాడు. నిజం చెప్పాలంటే దర్శకుడు ఏఆర్ మురగదాస్కు నేను థాంక్స్ చెప్పాలని మొదటిసారి ఒక కథతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కేవలం స్క్రిప్ట్ గురించి మాత్రం ఆలోచించారు తప్ప నా లుక్ ఎలా ఉందనేది చూడలేదు అన్నాడు.

నా కథపై నమ్మకం ఉంచి నా తొలి సినిమాకు నిర్మాతగా కూడా ఆయన పని చేశాడని… కాబట్టి ప్రపంచం కూడా మన వర్క్ నే చూడాలన్నాడు. రూపాన్ని బట్టి మనల్ని అంచనా వేయకూడదని మనిషి ఎలా ఉన్నాడు అనేది కాకుండా హృదయంతో చూడాలంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక కపిల్ శర్మ అడిగిన ప్రశ్నపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సౌత్ ఇండియా వాళ్ళ అందం గురించి మాట్లాడే ముందు మీ స్టార్ హీరోలకు సౌత్ ఇండియా సినిమానే దిక్కయిందని… ఇండియాకు ఎక్కువ ట్యాక్స్ ఇచ్చేది సౌత్ ఇండియానే అని… మా సినిమాలతో బాలీవుడ్ ని పడుకోపెట్టామని కాబట్టి ఎక్స్ట్రాలు చేయవద్దంటూ కపిల్ శర్మకు వార్నింగ్ ఇస్తున్నారు. అసలు సౌత్ ఇండియన్ స్టార్స్ కపిల్ శర్మ షో కి వెళ్లవద్దని అవసరమైతే అతనిపై తమ సినిమాల్లో వెటకారపు సన్నివేశాలను కూడా చిత్రీకరించాలి అంటూ కోరుతున్నారు.