A RATED MOVIES: ఆ సినిమాలకు పిల్లల్ని తీసుకెళ్ళొద్దు..! పేరెంట్స్‌కు పోలీసుల సూచన..

A సర్టిఫికెట్ ఉన్న సినిమాల విషయంలో తల్లిదండ్రులే.. తమ పిల్లలను తీసుకురాకుండా చూడాలని కోరుతున్నారు థియేటర్ల యజమానులు. ఒక్కోసారి తాము వేరే సినిమాకు వెళ్ళాలని రిక్వెస్ట్ చేసినా.. పేరెంట్స్ ఒప్పుకోవడం లేదంటున్నారు.

  • Written By:
  • Publish Date - December 30, 2023 / 04:50 PM IST

A RATED MOVIES: హైదరాబాద్‌లో ఇకపై A రేటెడ్ సినిమాలకు మైనర్లను తీసుకెళ్ళొద్దని కోరుతున్నారు పోలీసులు. సింగిల్ స్క్రీన్స్, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో తనిఖీలు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఏ రేటింగ్‌తో నడుస్తున్న సినిమాలకు పది, పదకొండేళ్ళ పిల్లలను తల్లిదండ్రులు తీసుకెళ్ళడాన్ని గమనించారు. పేరెంట్స్‌కి అవగాహన కల్పించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని థియేటర్లలో పోలీసులు ఆకస్మింగా తనిఖీలు నిర్వహించారు. ఈమధ్యే రిలీజ్ అయిన యానిమల్, సలార్, మంగళవారం మూవీస్ ఆడుతున్న సింగిల్ స్క్రీన్స్, మల్టీఫ్లెక్స్ థియేటర్లను పరిశీలించారు. ఈ మూడు సినిమాలకు సెంట్రల్ సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది.

Kalki 2898 AD: వచ్చేది ఆ రోజునే.. కల్కి ట్రైలర్ కు డేట్ ఫిక్స్..!

జనరల్‌గా మూవీస్‌కి సంబంధించి సెన్సార్ బోర్డు రెండు రకాలుగా సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తుంది. ఆ సినిమాల్లో హింసాత్మక సన్నివేశాలు, అసభ్యకరమైన కంటెంట్ ఉంటే దాన్నిబట్టి అది పెద్దలు చూడాల్సిందా.. పిల్లలు కూడా చూడవచ్చా అన్నది నిర్ణయిస్తుంది. అందులో భాగంగా UA సర్టిఫికెట్ ఇస్తే.. 12యేళ్ళ లోపు పిల్లలు ఆ సినిమాలకు తమ తల్లిదండ్రులతో కలసి మాత్రమే వెళ్ళాలి. అలాగే A సర్టిఫికెట్ ఇస్తే అది పెద్దలకు మాత్రమే. ఈ మూవీకి 18యేళ్ళలోపు పిల్లలు వెళ్ళకూడదు. థియేటర్లు కూడా వాళ్ళని అనుమతించరాదు. కొత్తగా రిలీజైన యానిమల్, సలార్, మంగళవారం సినిమాలకు ఏ రేటెడ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు 18 యేళ్ళలోపు పిల్లలు చూడటానికి థియేటర్లలో అనుమతి లేదు. అందుకే దీనిపై పేరెంట్స్‌కు అవగాహన కల్పించారు సైబరాబాద్ పోలీసులు. 18యేళ్ళ లోపు పిల్లల్ని ఎందుకు లోపలికి ఎంట్రీ కల్పించారని మాల్స్ యజమానులను ప్రశ్నించారు. యాప్స్, వెబ్‌సైట్స్ నుంచి నేరుగా టిక్కెట్లు కొనుక్కొని థియేటర్‌కు వస్తున్నారని చెబుతున్నారు. దాంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని అన్నారు.

A సర్టిఫికెట్ ఉన్న సినిమాల విషయంలో తల్లిదండ్రులే.. తమ పిల్లలను తీసుకురాకుండా చూడాలని కోరుతున్నారు థియేటర్ల యజమానులు. ఒక్కోసారి తాము వేరే సినిమాకు వెళ్ళాలని రిక్వెస్ట్ చేసినా.. పేరెంట్స్ ఒప్పుకోవడం లేదంటున్నారు. హింసను ప్రేరేపించేవి, అసభ్యకరంగా ఉన్న A రేటెడ్ సినిమాలను పిల్లలకు చూపించడం వల్ల.. వాళ్ళ మానసిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు సైకాలజిస్టులు. ఇప్పటికైనా పోలీసులు రెగ్యులర్‌గా థియేటర్లలో తనిఖీలు నిర్వహించాలనీ.. A సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు 18యేళ్ళ లోపు పిల్లలను అనుమతించకుండా థియేటర్లు కూడా చర్యలు తీసుకోవాలని కొందరు తల్లిదండ్రులు సూచిస్తున్నారు. సైబరాబాద్ పోలీసుల చర్యను అభినందిస్తున్నారు.