ఎన్టీఆర్ రేంజ్ ఈజీ కాదు పుష్పరాజా.. రాజమౌళి లేకుండా 1000 కోట్ల సీన్..?

రాజమౌళి సపోర్ట్ లేకుండా వెయ్యికోట్ల ఆల్ మోస్ట్ అసాధ్యం... అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒకే ఒక్క హీరో రెబల్ స్టార్ ప్రభాస్. కల్కీ తో ఆ రికార్డు తనకి సొంతమైంది. ఇక ఖాన్లలో షారుఖ్ ఖాన్, కన్నడ స్టార్లలో కేజీయఫ్ ఫేం యష్...

  • Written By:
  • Publish Date - November 30, 2024 / 04:35 PM IST

రాజమౌళి సపోర్ట్ లేకుండా వెయ్యికోట్ల ఆల్ మోస్ట్ అసాధ్యం… అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒకే ఒక్క హీరో రెబల్ స్టార్ ప్రభాస్. కల్కీ తో ఆ రికార్డు తనకి సొంతమైంది. ఇక ఖాన్లలో షారుఖ్ ఖాన్, కన్నడ స్టార్లలో కేజీయఫ్ ఫేం యష్… కాకపోతే ఇక్కడ రాజమౌళి సపోర్ట్ లేకున్నా 1000 కోట్లు రాకున్నా, కొండంత ట్రెండ్ ని సెట్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ట్రోలింగ్స్, కామెంట్స్ ని ఫేస్ చేసి కూడా ఫార్ములా మూవీతో 510 కోట్లు రాబట్టగలిగాడు. అలాంటి ఈ స్టార్స్ కష్టం చూశాక కూడా పుష్ప రాజ్ రాజమౌళి సాయం లేకుండానే వెయ్యికోట్ల ఐకాన్ స్టార్ గా మారుతాడంటూ ప్రచారం చేస్తున్నారు. ఆశ పడటం తప్పులేదు. పుష్ప2 హిట్ కి గ్యారెంటీ కి ఎలాంటి డౌట్ లేదు. కాని ప్రభాస్, ఎన్టీఆర్ కి సాధ్యమైందే బన్నీకి సాధ్యమా అంటే, అక్కడే కామెంట్లు దాడి చేస్తున్నాయి…

ఎన్టీఆర్ , ప్రభాస్ ఈ ఇద్దరినీ పాన్ ఇండియా రేంజ్ లో దాటేసేందుకు పుష్పరాజ్ భారీగానే వస్తున్నాడు. భారీగానే ప్రమోషన్ పెంచాడు. పాటలు, తర్వాత వివాదాలు, ఆతర్వాత ముంబై టు గోవా ప్రమోషనల్ ఈవెంట్లు.. ఇన్ని చేస్తే దేవర, సలార్, కల్కీలని మించిపోతాడా?

పుష్ప హిట్ మూవీ కాబట్టి సీక్వెల్ కూడా హిట్ అవటానికే అవకాశం ఎక్కువ. అలాని వెయ్యికోట్ల కటౌట్ అని ఆశపడటం వరకు ఓకే కాని, అది సాధ్యమా అన్న డౌట్లకు సాలిడ్ కారణాలు కనిపిస్తున్నాయి.

పాన్ ఇండియా హిట్ కావాలన్నా, అందులోనూ 1000 కోట్ల వసూళ్ల రికార్డులు క్రియేట్ అవ్వాలంటే రాజమౌళి సీన్లో ఉండాల్సిందే. తన వల్లే ఇప్పటి వరకు అలాంటి రికార్డులు క్రియేట్ అయ్యాయి. బాహుబలి 2 మూవీ 1850 కోట్లు రాబట్టి ఇండియా నెం. 2 మూవీగా ఉంటే, త్రిబుల్ ఆర్ తో 1350 కోట్ల వసూళ్లొచ్చాయి…

కేజీయఫ్ 2 తో ప్రశాంత్ నీల్, యష్ టీం 1250 కోట్ల వసూల్లు కొల్లగొట్టి , రాజమౌళిగైడెన్స్ లోనే హిట్ మెట్టెక్కింది. ఆతర్వాత కల్కీ 2 తో ప్రభాస్ 1200 కోట్ల రికార్డు దక్కింది.. ఇవన్నీ ఎగ్జాంపుల్ గా తీసుకుని ఫుష్ప2 టీం కూడా రాజమౌలి సపోర్ట్ లేకుండానే 1000 కోట్ల చరిత్ర స్రుష్టింస్తుందంటున్నారు

ఆశపడటంలో తప్పులేదు. హిట్ మూవీ సీక్వెల్ కాబట్టి అదేం అంత తప్పు కాదు. కాని 1350 కోట్ల త్రిబుల్ ఆర్ తర్వాత దేవర తో 510 కోట్లు హిట్ సొంతం చేసుకున్న దేవరతో పుష్ప2ని పోల్చటమే కాస్త అతిగా ఉందంటున్నారు

కారణం కొరటాల శివకి పాన్ ఇండియా ఇమేజ్ లేదు, దేవర కంటెంట్ కంటే ఎన్టీఆర్ ఇమేజ్ మీదే ఈ సినిమా దూసుకెళ్లింది కాబట్టి,పుష్పతో దేవరకి పోలికే లేదు. కంటెంట్ తోపాటు దేవి మ్యూజిక్, సుకుమార్ మేకింగ్ ఇవన్నీ కలిపితేనే పుష్ప కి ఆ సీన్ వచ్చింది. పుష్ప2 రాబోతోంది. ఇక ప్రభాస్, చరణ్, ఇలా ఎవరూ రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయకపోయినా, ఎన్టీఆరే రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయగలిగాడు.

ఇలా ఏటికి ఎదురీదిన దేవరతో పుష్ప2 పోలికే సరైంది కాదనే కామెంట్ల దాడి పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 250 కోట్ల వరకు దేవర రాబడితే, బాహుబలి 2 మూవీ 330 కోట్లు రాబట్టింది. అలాంటిది పుష్ప 2 ఏకంగా 400 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాలనుంచి రాబడుతుందనుకుంటే, అతివిశ్వాసమే అవుతుంది. దేశం మొత్తం పూనకాలు వచ్చేలా బాహుబలి 2 వస్తేనే , తెలుగు రాష్ట్రాల్లో 330 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అలాంటిది పుష్ప 2 కి టిక్కెట్ రేట్లు ఎంత పెంచినా 400 కోట్ల వసూళ్లు అసాధ్యం… మొత్తానికి ఈ అతివిశ్వాసం, అతి ప్రమోషన్ పుష్ప 2 మీద అంచనాల భారం పెంచి సెల్ఫ్ గోల్ అయ్యేలా చేసేలా ఉందనంటున్నారు. కామెంట్ల దాడి పెంచారు.