1000 కోట్ల తప్పుకి 2000 కోట్ల శిక్ష… అందుకే బాయ్ కాట్…?

పుష్పరాజ్ 2 మూవీ రిలీజ్ కి టైం దగ్గర పడింది. ప్రివ్యూ టిక్కెట్ రేట్లు, తెలంగాణ, ఆంధ్రాలో బెనిఫిట్ షోల నుంచి అదనపు షోల వరకు హంగామా మొదలైంది. కాని పుష్ప 2 మూవీటీం మరే సినిమా టీం ఫేస్ చేయనంతగా విమర్శలు ఫేస్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - December 3, 2024 / 01:01 PM IST

పుష్పరాజ్ 2 మూవీ రిలీజ్ కి టైం దగ్గర పడింది. ప్రివ్యూ టిక్కెట్ రేట్లు, తెలంగాణ, ఆంధ్రాలో బెనిఫిట్ షోల నుంచి అదనపు షోల వరకు హంగామా మొదలైంది. కాని పుష్ప 2 మూవీటీం మరే సినిమా టీం ఫేస్ చేయనంతగా విమర్శలు ఫేస్ చేస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్, నిర్మాతలు ఇలా మొత్తంగ ఈ సినిమా టీం చేసిన 1000 కోట్ల కాస్ట్ లీ తప్పులకి, శిక్ష మాత్రం ఆడియన్స్ కి పడేలా ఉందంటున్నారు. విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో బాయ్ కాట్ అన్న మాట్ ట్రెండవుతోంది. ఇంతకి ఎక్కడ తప్పు జరుగుతోంది? ఒకవైపు హాట్ కేకుల్లా టిక్కెట్లు లక్షల్లో అమ్ముడుపోతున్నాయంటున్నారు.. మరో వైపు ఆర్టీఫిషియల్ హైప్ తో ఇండస్ట్రీ డ్యామేజ్ అయ్యేలా ఉందంటున్నారు.. ఇంతకి ఏంజరుగుతోంది? ఏది నిజం?

పుష్ప 2 మూవీ మూడేళ్లు తీశారు… 300 కోట్లు బడ్జెట్ మూవీ కూడా ఎక్కువే అనుకుంటే, 500 కోట్లు ఖర్చు వరకు తీసుకొచ్చారు.. ఇదంతా రైటింగ్, మేకింగ్ లో జరిగిన డిలే పుణ్యమే అన్నకామెంట్స్ ఉన్నాయి.. ఇలా డైరెక్టర్స్ టీం, ప్రొడక్షన్ టీం చేసిన మిస్టేక్స్ వల్ల, సినిమా హిట్టైనా, లాభాలు రావటం కష్టం. అంటే నష్టాలే వచ్చే ఛాన్స్ ఎక్కువ.

కాని ఆ నష్టాలను భర్తి చేసేందుకు ఆడియన్స్ నుంచి 200 టిక్కెట్ ప్లేస్ లో 1250 టిక్కెట్ పెట్టి రాబట్టాలనుకోవటం మీదే విమర్శలు పెరిగాయి. హై బడ్జెట్ మూవీలు విడుదలౌతున్నాయంటే, ఎక్స్ ట్రా షోలు వేసుకోవచ్చు. టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చు.. ఇది కొంతవరకు పర్లేదు. కాని రెగ్యులర్ టిక్కెట్ కి అదనంగా ఏ 50 రూపాయలో వందో పెంచితే అర్ధం చేసుకోవచ్చు.. ఏకంగా ఎనిమిదొందలు తెలంగాణాలలో టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చట

డిసెంబర్ 4న ప్రివ్యూ పడబోతోంది, తెలంగాణలో రాత్రం 9: 30 గంటలకే ప్రివ్యూ హడావిడికి పర్మీషన్ దొరకటమే కాదు, విచిత్రంగా ఈ సినిమా ఆడియే మల్టీప్లెక్స్ థియేటర్స్ అయినా, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయినా రెగ్యులర్ టిక్కెట్ రేటుకి అదనంగా 800 పెంచుకోవచ్చనటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది

రోజుకి మూడు నాలుగు లీటర్లిచ్చే ఆవునుంచి వందరోజుల పాలు ఒక్కరోజులోనే పిండేసినట్టు.. పుష్ప 2 వెయ్యికోట్ల కలని, ఒక్కవారంలో నిజం చేసుకునే ప్రయత్నమే జరుగుతోందంటున్నారు. సోషల్ మీడియాలో పుష్ప 2 టీం అత్యాశ మీద కామెంట్ల దాడి పెరిగింది.

పుష్ప 2 ప్రివ్యూకి ప్రతీ థియేటర్ రెగ్యులర్ రేటుకి 800 పెంచటంతో పాటు, మొదటి రోజునుంచి మూడోరోజు వరకు మల్టీ ప్లెక్స్ లో 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 150 చొప్పున అదనంగా వసూళ్ చేయొచ్చట. ఇలా ప్రతీ 5 రోజులకో రేటు చొప్పున పుష్ప2 మూవీ విడుదలైన 17 రోజుల వరకు ప్రతీ టిక్కెట్ మీద ఈ అదనపు బాదుడు ఉండబోతోంది.

బాహుబలి2, కల్కీ లాంటి విజువల్ వండర్స్ కి భారీగా ఖర్చవుతుంది కాబట్టి, భారీ పెట్టుబడి కావాలి. వాటిని రాబట్టాలంటే భారీగా టెక్కెట్ ధర పెంచాలి… అలాంటిది పుష్ప2 లో అంత విజువల్ ఎఫెక్ట్స్ ఏముంటాయి… వీళ్లకు బద్దకమై మూడేళ్లు టైం వేస్ట్ చేసి, మేకింగ్ ఛార్జ్ లు పెంచేసి, హీరో రెమ్యునరేషన్ భారీగా సమర్పించి, ఆ మొత్తాన్ని ఆడియన్స్ నుంచి లాగేయాలనుకోవటం మీదే ట్రోలింగ్ పెరిగిపోయింది.

రైతులకు కనీస మద్దతు ధర పెంచరుకాని, టిక్కెట్ రేట్లు ఇష్టంవచ్చినట్టు పెంచేస్తారా అని ఒక ట్వీటు… అంత బడ్జెట్ పెట్టి ఎవరు తీయమన్నారంటూ మరో ట్వీటు… ఇలా పుష్ప2 ని బాయ్ కాట్ చేయమంటూ ఓ ట్రెండే సెట్ అవుతోంది.