సరే.. ఆ పోస్టర్ అయినా బాగుందా అంటే అదీ లేదు. రోజూ క్యాలెండర్‌లో చూసే రాముడి ఫొటోకు ప్రభాస్, కృతి ముఖాలు మార్ఫింగ్ చేసినట్టు ఉంది. ఇంకేముందు ఇంతకు ముందుకంటే ఘోరంగా సినిమాను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. పోస్టర్‌లో కృతి సనన్ కాళ్లకు మెట్టెలు లేవు, మెడలో తాళి లేదు, నుదుటికి సింధూరం లేదు. సీత పాత్ర అంటేనే సాంప్రదాయాలకు శాంపిల్ లాంటిది. కానీ కృతిలో అవ్వేమీ కనిపించడంలేదు. కృతి సీతలా కాదు.. సీత చెలికత్తెలా కూడా లేదంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక రాముడికి సూర్యుడి బొట్టు ఉండాల్సిన ప్లేస్‌లో వెంకటేశ్వరడు 3నామాలు ఉన్నాయి. లక్ష్మణుడికి, ఆంజనేయుడికి గడ్డం ఉంది. అంతే.. ఫ్యాన్స్ కూడా చిర్రెత్తిపోయారు. ఎక్కడినుంచి తీసుకున్నారురా ఈ స్టోరీ అంటూ ఓ రేంజ్‌లో వేసుకుంటున్నారు. ప్రొడక్షన్ కంపెనీ అఫీషియల్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ జూమ్ చేస్తే పిక్సెల్‌అవుట్ అవుతోంది.. 500 కోట్లు ఏం చేశారురా కనీసం పోస్టర్ కూడా హైక్వాలిటీతో చేయలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆదిపురుష్ టీజర్ వచ్చినప్పుడు కూడా ఇదే రేంజ్‌లో ట్రోల్స్ వచ్చాయి.
రాముడిని మీసాలతో చూసిన అభిమానులు షాకయ్యారు. రావణసురుడిని స్టైలిష్ హెయిర్ కట్‌లో చూసి మానసికంగా మండిపోయారు. ఏం దారుణాలురా ఇవీ అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశారు. దీంతో అప్పుడు కాస్త కవర్ చేసుకునేందుకు ట్రైచేశారు మూవీ మేకర్స్. కానీ ఫ్యాన్స్ మాత్రం ఊరుకోలేదు. ట్రోలింగ్‌తో లిట్రర్‌గా చంపేశారు. ఫ్యాన్స్‌ను కూల్ చేసేందుకు ఇప్పుడు ఓ పోస్టర్ రిలీజ్ చేసి మరోసారి వాళ్ల కోపాన్ని డబుల్ చేశారు. రోజు ఇంట్లో చూసే రాముడి ఫొటోకు మీ పోస్టర్‌కు ఉన్న తేడా ఏంటని ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు.
ఈ దారుణాన్ని థియేటర్‌లో చూడటం మా వల్ల కాదు.. ఓటీటీలో రిలీజ్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. వింత వింత మీమ్స్ క్రియేట్ చేసి ఓం రౌత్‌ను ఆడుకుంటున్నారు. అప్పుడు టీజర్‌ను శాంపిల్స్ అని చెప్పిన ఓం రౌత్.. ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేస్తాడో చూడాలి.