PUSHPA 2: పుష్ప 2 రూల్ వచ్చేస్తోంది.. ఇక పాటల తూటాలే..

ఇందులో 6 సాంగ్స్ ఉంటే.. అందులో ఒకటి మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది. ఇక మిగతా 5 సాంగ్స్‌లో మాత్రం రెండు డ్యూయెట్లు, ఒక టైటిల్ సాంగ్, మిగతా రెండు రెబల్ సాంగ్స్ అని తెలుస్తోంది. ప్రతీ రెండు వారాలకో పాటను రిలీజ్ చేస్తూ పుష్ప 2 టీం, హైప్ పెంచే పనిలో ఉంది.

  • Written By:
  • Updated On - April 24, 2024 / 07:49 PM IST

PUSHPA 2: పుష్ప రాజ్ ది రూల్ ఆగస్ట్ 15న రాబోతోంది. అందుకు 3 నెలల ముందునుంచే పుష్ప పాటల తూటాలు పేలబోతున్నాయి. ఇందులో 6 సాంగ్స్ ఉంటే.. అందులో ఒకటి మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది. ఇక మిగతా 5 సాంగ్స్‌లో మాత్రం రెండు డ్యూయెట్లు, ఒక టైటిల్ సాంగ్, మిగతా రెండు రెబల్ సాంగ్స్ అని తెలుస్తోంది.

FAMILY STAR: ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. రెండ్రోజుల్లోనే ఓటీటీలోకి

కాని పుష్ప 2 రిలీజ్‌కి 3 నెలలకు పైనే టైం ఉన్నా ఇప్పటి నుంచే పాటల తూటా పేల్చాలనుకోవటానికి కారణం, సాలిడ్‌గా ప్రమోషన్‌లో ఎమోషన్ పెంచాలనే నిర్ణయమని తెలుస్తోంది. పుష్ప రిలీజ్ టైంలో సౌత్‌లో మంచి ప్రమోషన్ దక్కింది. కాని హిందీ వర్షన్‌ని పాటలే కాపాడాయి. ఇక అలాంటి మిస్టేక్ ఈసారి చేయొద్దని, పుష్ప 2 రిలీజ్‌కి 3 నెలల ముందునుంచే పాటలు, టీజర్లు, ట్రైలర్.. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వదలబోతున్నారు. అల వైకుంఠపురంలో మూవీ విడుదలకు 4 నెలల ముందునుంచే ఒక్కో పాట వదిలారు.

దీంతో జనాల మధ్య అల వైకుంఠపురంలో మూవీ మీద హైప్ పెరిగింది. పుష్ప 1 కి అదే జరిగింది. కాబట్టే ప్రతీ రెండు వారాలకో పాటను రిలీజ్ చేస్తూ పుష్ప 2 టీం, హైప్ పెంచే పనిలో ఉంది. మొన్న టీజర్, ఇప్పుడు తూటా లాంటి పాట.. ఇది వర్కవుట్ అయ్యే స్ట్రాటజీలానే కనిపిస్తోంది.