ఆమె కోసమే ఐశ్వర్యను వదిలేస్తున్నాడా…? మళ్ళీ సల్మాన్ ఎక్స్ తో అభిషేక్

బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఇద్దరూ ఎక్కడా బయటపడకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - November 4, 2024 / 04:56 PM IST

బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఇద్దరూ ఎక్కడా బయటపడకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి. ఎవరి తప్పు ఉంది అనే దానిపై ఏ క్లారిటీ లేదు గాని సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ మాత్రం ఇద్దరి తప్పు చూపిస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకోవడం కోసం అభిషేక్ కు దూరం కావాలని చూస్తోందని ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ వార్తలు వచ్చాయి.

ఇప్పుడు అభిషేక్ విషయంలో కూడా అలాంటి గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. గత కొంత కాలంగా ఓ హీరోయిన్ తో అభిషేక్ క్లోజ్ గా ఉంటున్నాడు అనే రూమర్స్ వస్తున్నాయి. ఇద్దరూ విడిపోవడం ఖాయం అనే రూమర్స్ కు ఐశ్వర్య క్లారిటీ ఇచ్చినా ఎండ్ కార్డ్ మాత్రం పడటం లేదు అనే చెప్పాలి. ఐశ్వర్య రాయ్ ఇంటి దగ్గర జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్‌లో అభిషేక్ కనిపించకపోవడంతో విడిపోయారు అంటూ ప్రచారం పీక్స్ లో జరిగింది. ఇక అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ కలిసి కనపడలేదు.

ఐశ్వర్య తన కూతురు ఆద్యతో కలిసి హాజరవ్వ‌గా.. అభిషేక్ బచ్చన్ మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి రావడంతో విడాకులు అయిపోయి ఉండవచ్చు అంటూ ప్రచారం స్టార్ట్ అయింది. ఐశ్వర్య విదేశాలకు వెళ్ళినా ఏ ఫంక్షన్ కు వెళ్ళినా కూతురితో కలిసే వెళ్తోంది. దీనితో విడాకులు ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నిమ్ర‌త్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్ ప్రేమలో పడ్డారంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారణంగానే ఐశ్వ‌ర్య‌ను అభిషేక్ దూరం పెడుతున్నాడని టాక్.

అందుకే తన భార్య ఐశ్వ‌ర్య‌కు విడాకులు ఇచ్చి త్వరలోనే నిమ్ర‌త్‌ను పెళ్లి చేసుకోనే థాట్ లో ఉన్నట్టు కూడా బాలీవుడ్ లో ఓ గాసిప్ వైరల్ అవుతోంది. ఇటీవల అభిషేక్ న‌టించిన ‘దస్వి’ సినిమాలో హీరోయిన్‌గా ఆమె నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ క్లోజ్ అయ్యారని బాలీవుడ్ లో కోడై కూస్తున్నారు. ఈ వార్తలకు బలం చేకూర్చుంది నిమ్రత్ కౌర్ సింగిల్ గా ఉండటం. ఆమెకు 42 ఏళ్ళు వచ్చినా సింగిల్ గా ఉంటూ ఇంకా పెళ్లి చేసుకోలేదు. సల్మాన్ తో అప్పట్లో ప్రేమాయణం నడిపింది కూడా. ఇప్పుడు మళ్ళీ అభిషేక్ తో ప్రేమలో పడిందని టాక్ వస్తోంది. ఏది ఎలా ఉన్నా.. సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్స్ ను అభిషేక్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ సెటైర్ లు వస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ కూడా సల్మాన్ తో ప్రేమ వ్యవహారం నడిపింది.