Sunil: సునీల్ కమేడియన్‌గా బ్రహ్మానందం, అలీనే మించిపోయాడనుకున్న టైంలో సడన్‌గా హీరోగా మారి దారి తప్పాడన్నారు. అనవసరంగా సిక్స్ ప్యాక్‌తో తన ముఖంలో ఆ కామెడీ కళ పోగొట్టుకున్నాడన్నారు. కట్ చేస్తే హీరోయిజం వదిలేసి, మళ్లీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక తనకు మంచి గుర్తింపు దక్కుతోంది. తెలుగులో తన కెరీర్ గాడిన పడుతుంది అనుకునేలోపు.. కోలీవుడ్‌లో ఈ కమెడియన్‌కి ఊపొచ్చింది. జైలర్‌లో సునీల్ వేసిన పాత్ర అక్కడి జనాలకు బాగా గుచ్చుకున్నట్టుంది.
ఈ విగ్ రాజాని అక్కడ తెగ ఇష్టపడుతున్నారు. అంతేకాదు పుష్పలో తను చేసిన విలనిజంతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కింది. అది కూడా జైలర్ మూవీలో సునీల్ పాత్రకి కలిసొచ్చింది. ఏదేమైనా సునీల్‌కి ఒక్క జైలర్‌లో వేసిన పాత్రతో ఏకంగా 15 తమిళ సినిమాల్లో ఛాన్స్ చిక్కింది. ఐతే సునీల్ కమెడియన్‌గా దూసుకెళ్లే టైంలో హీరోగా మారి అనవసరంగా కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్నాడన్నారు. కానీ, నిజానికి అదే సునీల్‌కి కలిసొచ్చింది. ఒకవేళ తను హీరోగా మారకుండా ఇంకా కమెడియన్‌గా కొనసాగితే మొనాటనీ అయ్యి, తను కూడా బోర్ కొట్టేవాడు. అలా కాకుండా హీరోగా మారి ఛేంజ్ చూపించాడు. స్థాయిని పెంచుకున్నాడు.
మళ్ళీ కమెడియన్‌గా మారినా, తనకి హీరోకిచ్చే గౌరవమే ఇస్తారు కాబట్టి.. అది మరో ప్లస్ అనుకోవాలి. ఏదేమైనా హీరోయిజం వల్ల గ్యాప్ వచ్చినా, సునీల్ మళ్లీ కామెడి దాడి పెంచటంతో, తన టైమింగ్ ఫ్రెష్‌గా అందరికీ నచ్చుతోంది. ముఖ్యంగా తమిళ తంబీలని ఫిదా చేస్తోంది.