Adah Sharma: 15 ఏళ్లు వెయిట్ చేస్తేగానీ.. అదాశర్మకు క్రేజ్ దక్కలేదు. ది కేరళ స్టోరీతో వచ్చిన క్రేజ్‌ను జాగ్రత్తగా వాడుకుంటోంది. కథ అంతా తన చుట్టూ తిరిగే సినిమాతో వస్తోంది అదా. ఒకప్పటి ఈ గ్లామర్ బ్యూటీ లీడ్ రోల్ వదిలేసి నక్సల్స్ రోల్ ఎంచుకుంది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లయింది. తెలుగు, తమిళం, హిందీలో నటించినా.. రాని గుర్తింపు కాంట్రవర్సీ మూవీ ది కేరళ స్టోరీతో వచ్చింది. సినిమా వరల్డ్ వైడ్ రూ.300 కోట్లు రాబట్టింది. ఎవరీ హీరోయిన్ అంటూ.. అందరూ అడిగేలా క్రేజ్ సంపాదించుకుంది అదా.
ది కేరళ స్టోరీ తర్వాత అదా శర్మ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బస్తర్‌కు సైన్ చేసింది. ఈ సినిమాకు ది నక్సల్స్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. సుదీప్తో సేన్ దర్శకత్వంలో ది కేరళ స్టోరీ నిర్మాత విపుల్ అమృత్ పాల్ షా నిర్మిస్తున్నారు. ఇందులో అదా మావోయిస్టు లీడర్‌గా కనిపించబోతుంది. రీసెంట్గా షూటింగ్ మొదలుకాగా.. ఫోటోలను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అదాశర్మ 2008లో 1920 అనే హిందీ మూవీతో వెండితెరపైకి వచ్చింది. నితిన్ హార్ట్ ఎటాక్‌తో తెలుగులోకి వచ్చిన అదాశర్మ.. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం వంటి హిట్ మూవీస్ చేసినా.. తెలుగులో క్రేజీ ఇమేజ్ దక్కించుకోలేకపోయింది. 2019లో వచ్చిన కల్కి తర్వాత తెలుగులోనే కాదు.. మరే భాషలోనూ సినిమా చేయలేదు. సినిమాలకు దూరమైన అదాశర్మ చాలాకాలం బెల్లీ డ్యాన్స్.. రోప్ డ్యాన్స్ అంటూ.. గ్లామర్ వీడియోస్‌తో ఇన్‌స్టాలో కాలక్షేపం చేసింది. రకరకాలు టాలెంట్ చూపిస్తూ.. ఫ్యాన్స్‌కు, ఇండస్ట్రీకి టచ్‌లో వుంటూ వచ్చింది.
ఒక్కోసారి గ్లామర్ డోస్ పెంచినా ఆఫర్స్ మాత్రం కరుణించలేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటూ.. ఎట్టకేలకు ది కేరళ స్టోరీతో వచ్చింది. దీంతో ఈ అమ్మడి స్టోరీ మారిపోయింది. మంచి పెర్ఫార్మర్గా పేరు తెచ్చుకోవడంతో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. మరోసారి నక్సలైట్‌గా పెర్ఫార్మెన్స్కు స్కోప్ వున్న రోల్‌తో ముందుకొస్తోంది అదా.