Jaya Prada: నటి జయప్రదకు 6 నెలల జైలు శిక్ష

లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన అనంతరం జయప్రదతో పాటు మరో ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే నిందితులకు 5వేల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 02:19 PM IST

Jaya Prada: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన అనంతరం జయప్రదతో పాటు మరో ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే నిందితులకు 5వేల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఓ సినిమా థియేటర్ ఉంది.

చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి అన్నారోడ్డులో సినిమా థియేటర్ నడిపించారు. సినిమా థియేటర్‌లో పనిచేస్తున్న కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు కార్మికులు. వాళ్లకు రావాల్సిన మొత్తాన్ని ఇస్తానని, ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని జయప్రద కోరింది. దీనికి లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీంతో ఎగ్మోర్ కోర్టు జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. సినీ, రాజకీయ రంగాల్లో చురుగ్గా పాల్గొన్న జయప్రదకు చెన్నైలో  థియేటర్‌ ఉండేది. మొదట్లో థియేటర్‌కు ఆదరణ లభించినా.. ఆ తర్వాత ఆదాయం బాగా తగ్గడం మొదలైంది. ఈ సమస్యతోపాటు ఆస్తి వివాదాలు కూడా చుట్టముట్టడంతో థియేటర్‌ను మూసివేశారు.

థియేటర్‌లో పనిచేస్తున్న కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్‌ఐ మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెల్లించలేదు. చివరకు కార్మికులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. జయప్రదతోపాటు యజమానులకు శిక్ష విధించింది.