VIJAY-NAMITHA: హీరో దళపతి విజయ్ తమిళనాడులో పెట్టిన కొత్త పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. అయితే, ఈ లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ముందే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ మీద తాను పోటీ చేస్తానంటూ గ్లామర్ డాల్ నమిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో హీరో విజయ్ సినిమాలకు ఫుల్లుగా క్రేజ్ ఉంటుంది.
Allu Arjun: అన్నీ గాలి వార్తలే.. అల్లు అర్జున్‌ను పక్కన పెట్టిన అట్లీ
ఈ మధ్యే కొత్త పార్టీ పెట్టిన విజయ్.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్నాడు. ఈ పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని అభిమానులు కూడా టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. అయితే విజయ్‌పై పోటీకి హీరోయిన్ నమిత రెడీ అంటోంది. ఆమె ప్రస్తుతం తమిళనాడు బీజేపీ కార్యవర్గ సభ్యురాలిగా ఉంది. లోక్ సభ ఎన్నికల కోసం నమిత బీజేపీ తరపున ప్రచారం కూడా చేస్తోంది. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ తరపున నీలగిరి లోక్‌సభ నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేస్తోంది. నమితకు కూడా తమిళనాడులో ఫుల్లుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఆమె కోసం అభిమానులు గుడి కూడా కట్టారు. విజయ్ చాలా తెలివైన వాడనీ.. అందుకే అతనిపై పోటీ చేయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నమిత.
రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థిపైనే పోటీ చేయాలనీ.. అప్పుడు పాలిటిక్స్‌లో పైకి రావొచ్చని అంటోంది. నమిత కామెంట్స్‌పై హీరో విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ లీడర్ మీద పోటీ చేస్తే ఆమెకు డిపాజిట్లు కూడా రావంటూ ఎద్దేవా చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల టైమ్‌లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తన్న నమిత.. విజయ్‌పై పోటీకి సిద్దం అనడం సెన్షేషనల్‌గా మారింది.