Karthika Nair: జోష్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందా..? వరుడు ఎవరు..?

ప్రస్తుతం కార్తీకకు సంబంధించిన ఒక అంశం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కార్తీక ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ దీనంతటికీ కారణం. ఒక వ్యక్తిని చిరునవ్వుతో హగ్ చేసుకుని, వేలికి ఉంగరంతో ఉన్న ఫొటోను కార్తీక షేర్ చేసింది. దీంతో కార్తీక ఎంగేజ‌్‌మెంట్ చేసుకుందని వెల్లడించినట్లైంది.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 08:51 PM IST

Karthika Nair: నాగచైతన్య నటించిన తొలి చిత్రం జోష్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కార్తీక. నటి రాధ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీకకు రంగం అనే డబ్బింగ్ సినిమా బ్రేక్ ఇచ్చింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కార్తీకకు సంబంధించిన ఒక అంశం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కార్తీక ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ దీనంతటికీ కారణం.

ఒక వ్యక్తిని చిరునవ్వుతో హగ్ చేసుకుని, వేలికి ఉంగరంతో ఉన్న ఫొటోను కార్తీక షేర్ చేసింది. దీంతో కార్తీక ఎంగేజ‌్‌మెంట్ చేసుకుందని వెల్లడించినట్లైంది. ఈ ఫొటోకు ఈగల్ ఐ ఎమోజీని జత చేసింది. దీనర్థం నెగెటివ్ ఎనర్జీ పడకూడదనే. అయితే, కార్తీక ఎంగేజ్‌మెంట్ చేసుకుంది ఎవరితో అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. కార్తీక పెళ్లి గురించి ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని చాలా కాలం నుంచి ప్రచారం జరిగింది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని ఒకసారి.. కార్తీక ప్రేమలో ఉందని ఇంకోసారి.. ఇలా ఆమె గురించి పలు వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. కానీ, వీటిపై కార్తీక, రాధ సహా ఎవరూ స్పందించలేదు. అయితే, తాజా పోస్టుతో తనకు నిశ్చితార్థం జరిగిన విషయం మాత్రం బయటపడింది.

ఇది ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన సంబంధమా అనే విషయం మాత్రం ఇంకా తెలియదు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు కార్తీకకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. వరుడి వివరాలు తెలియాల్సి ఉంది. రాధ.. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 1980లో చిరంజీవి, రాధ.. సూపర్‌హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబినేషన్‌లో అనేక చిత్రాలొచ్చాయి.