Rakhi Sawant: అపర కుబేరుడు, బిజినెస్ టైకూన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లికి ముందు జరిగే వేడుకలు (ప్రీ వెడ్డింగ్) అంబరాన్ని తాకాయి. ముఖేష్, నీతా అంబానీల ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. మార్చి 1-3 తేదీ వరకు జరిగిన ఈ వెడ్డింగ్ ఫెస్టివల్‌కు ప్రపంచ దిగ్గజాలు, భారత వ్యాపార, క్రీడా, సినీ సెలబ్రిటీలు హాజరై.. సందడి చేశారు.
Isha Ambani: ఇషా స్పెషల్ ఎంట్రీ.. ఒక్క బ్లౌజ్ ధరే కోట్ల రూపాయలు
ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కే వేల కోట్ల ఖర్చు పెట్టినట్టు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తనను పిలవకపోవడంపై హర్ట్ అయిన నటి.. అనంత్ అంబానీని టార్గెట్ చేసింది. ఏకంగా తనను తాను డీగ్రేట్ చేసుకోవడమే కాకుండా.. అనంత్ అంబానీపై కూడా చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. పెళ్లికి పిలవలేదంటూ ప్రశ్నించిన అమ్మడు.. పిలిస్తే.. వంట పాత్రలే కాదూ ఫ్లోర్ క్లీన్ కూడా చేశాదాన్నంటూ చెప్పుకొచ్చింది. ‘ఈ వేడుకకు తనను ఎందుకు పిలవలేదు. రిహానా పాటుగా ఖాన్స్, ఐకాన్ అంటూ ఎవరినో పిలిచారు. తన ఫెర్మామెన్స్ సరిగ్గా చూడలేదు. తన డ్యాన్స్ ముందు అవన్నీ దిగదుడుపే అన్నట్లు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పైగా కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రిహానాను పిలిస్తే.. చినిగిన బట్టలతో వచ్చింది. తనకు 10 కోట్లు ఇచ్చి పిలిచి ఉంటే.. హాట్ అండ్ సెక్సీ బట్టలు వేసుకుని, డ్యాన్సులతో ఎంటర్‌న్ చేసేద్దాన్ని, గెస్ట్‌ల గదులు శుభ్రం చేయడం నుండి అంట్లు కూడా తోమేదాన్ని తాననేందుకు పిలవలేదని ప్రశ్నించింది. అంతటితో ఆగలేదు.
అనంత్ అంబానీ బరువుపై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ‘అంబానీ జీ నమస్తే.. అనంత్ అంబానీ బాగా బరువు పెరిగారు. మీ కోడలు దానిమ్మ పండులా ఉంటుంది. ఆయన సన్నగా అయితే ఆమెకే మంచిది. నన్ను నియమించుకుని.. అంబానీని నా దగ్గరకు ఐదు రోజులు పంపండి. సన్నటి పుల్లలా చేసి పంపిస్తాను. ఎక్సర్‌సైజులు చేయించడమే కాకుండా.. తృప్తి చెందేలా చేస్తాను. జీరో సైజుకు తీసుకు వస్తాను. ఆయన బరువు తగ్గితే మీతో పాటు మీ కోడలు, మీరు కూడా చాలా సంతోషిస్తారు. అందుకే నన్ను త్వరగా నియమించుకోండి. అర్థమైందా’ అంటూ హోయలు ఒలికిస్తూ వీడియో చేసి నెట్టింట్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతు్నాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.