SAMANTHA: మయోసైటిస్‌తో బాధపడుతున్న హీరోయిన్ సమంత.. ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌లో ఉన్నారు. సామ్ లేటెస్ట్ ఫొటోస్ చూసి ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు. మరీ బక్కచిక్కిపోయి.. కళ్లల్లో వెలుగు లేకుండా ఉన్నట్లు అనిపించాయ్ ఆ ఫొటోలు. తన డెయిలీ లైఫ్ విశేషాలను.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకునే సమంత.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది. యాక్టింగ్ నుంచి విరామం తీసుకోవడంపై సామ్ రియాక్ట్ అయింది.
KALKI 2898 AD: కల్కిలో ప్రభాస్ పాత్ర పేరెంటో తెలుసా..? కొత్త పోస్టర్ రిలీజ్
మ్యాగజైన్ ఫొటోషూట్‌లో పాల్గొన్న సామ్.. ఈ విషయం గురించి మాట్లాడింది. జీవితంలో తీసుకున్న కష్టమైన నిర్ణయం.. యాక్టింగ్‌కు దూరంగా ఉండడమే అని చెప్పుకొచ్చింది. మయోసైటిస్ నుంచి కోలుకునే ప్రాసెస్‌లో.. వృత్తిపరమైన జీవితం నుంచి విరామం తీసుకున్నా. ఇప్పటివరకూ తీసుకున్న కఠిన, ఉత్తమమైన నిర్ణయమదే. ఆరోగ్య పరిస్థితుల రీత్యా వర్క్ కంటిన్యూ చేయడం వీలుపడలేదు. పనిపరంగా ఒత్తిడి, ఇతర విషయాలను తట్టుకోవడం అంత సులభం కాదు అంటూ ఎమోషనల్ అయింది సమంత. దాదాపు 13 ఏళ్ల నుంచి పని చేస్తున్నా. కోపం, ఆత్మనూన్యతకు లోనైన సందర్భాలున్నాయ్. వాటన్నింటినీ ఎదుర్కొని మనిషిగా ఎదగాలని కష్టపడ్డా.. ఈ క్రమంలోనే అభద్రతా భావాలు తెలిసొచ్చాయని.. ఎదుటి వ్యక్తులతో ఆ విషయాల గురించి మాట్లాడి.. తనను తాను మెరుగుపరుచుకున్నట్లు చెప్పుకొచ్చింది సమంత.
ట్రోల్స్, విమర్శల మధ్య వ్యత్యాసం తెలుస్తోందన్న ఆమె.. వివరణాత్మక విమర్శలను స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పారు. కష్టసుఖాల్లో అభిమానులు అండగా నిలిచారని.. వారు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని సమంత భారంగా చెప్పుకొచ్చింది.