శ్రీలీలా టాప్ హీరోయినా అంటే కాదు, ఓరేంజ్ హిట్లున్నాయా అంటే లేదు.. కేవలం తెలుగులో చేసింది రెండు సినిమాలు. ఒకటి పెళ్లి సందడి. రెండు ధమాకా.. ఇందులో ధమాకా మాత్రమే హిట్. కానీ ఈ హీరోయిన్ కి ఉన్న డిమాండ్, రష్మికా, పూజా హెగ్డే కి కూడా లేదు.
శ్రీలీలను పవన్ కి జోడీగా ఉస్తాద్ భగత్ సింగ్ టీం తీసుకుంది. ఆల్రెడీ మహేశ్ తో త్రివిక్రమ్ తీసే సినిమాలో శ్రీలీలా సెకండ్ హీరోయిన్ గా మెరుస్తోంది. ఇక బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ చరణ్ చేసే సినిమాలో కూడా ఈ హీరోయిన్ కే ఆఫర్ వెళ్లిందట. ఒక వైపు నితిన్ మూవీ, రామ్ తో సినిమా, మరోవైపు పెద్ద హీరోలతో జోడీ కడుతూ శ్రీలీల ఫుల్ బిజీ.. కారణం పూజా హెగ్డే, రష్మికా రొటీన్ అవటంతో, కొత్తదనం కోసం శ్రీలీలకే షిఫ్ట్ అవుతున్నట్టున్నారు హీరోలు. ఫ్రెష్ ఫేసు, అందులోనూ తెలుగు.. కన్నడలో హిట్లు, డాన్స్ మీద మంచి పట్లు అన్నీ ఉన్నాయి కాబట్టే, శ్రీలీలకు టాప్ స్టార్స్ మొగ్గుచూపుతున్నట్టున్నారు. దీంతో తోటి హీరోయిన్లు కుళ్లుకునే పరిస్థితి వచ్చింది.